పాయల్ రాజ్ పుత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆరెక్స్ 100 సినిమా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే రెచ్చిపోయి నటించింది.. ఆ సినిమా హిట్ అయింది కానీ అమ్మడుకు సరైన సినీ అవకాశాలు రాలేదు.. దాంతో మళ్లీ అదే తరహాలో ఉండే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంది.. ఇటీవల మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఫామ్ లోకి వచ్చేసింది.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది..
ఆమె ఫోటోలకు భారీ వ్యూస్ తో పాటుగా క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.. తాజాగా మందు గ్లాసుతో టబ్ బాత్ లో రెచ్చిపోయింది.. సోషల్ మీడియాలోనే పాయల్ ఎక్కువగా ఫేమస్ అవుతుంటుంది. తాజాగా ఆమె ఓ వీడియోను వదిలింది. చూస్తుంటే అది ఏదో షూటింగ్ కోసం చేస్తున్నట్టుగా ఉంది. బిహైండ్ ది కెమెరా అన్నట్టుగా వర్కింగ్ వీడియోను షేర్ చేసింది.. అందులో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు.. చుట్టు కెమెరాలు ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది..
ఆ అమ్మాయిలు కూడా టబ్ లో ఉన్నారు.. అందరు కూడా చేతిలో మందు గ్లాస్ పట్టుకొని కనిపిస్తున్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో వీడియోను చూసిన నెటిజన్లు పాయల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదేం వీడియో.. నువ్వు అసలేం చేస్తున్నావ్.. మీ అందరినీ చూస్తుంటే ఏదో తేడాలా ఉందే.. అంటూ రెచ్చిపోతున్నారు… మొత్తానికి ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది..