ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి తర్వాత అంత కేజ్ ని సంపాధించిన మరో వ్యక్తి పవన్ కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. ఆయన మూడో భార్య అన్నా లెజ్నెవా గురించి తెలుసుకుందాం. అసలు ఆమె ఎవరూ..పవన్ కల్యాణ్ కి ఆమెకు ఎలా జోడి కుదిరింది. అనే అంశాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ప్రమాణ ప్రమాణస్వీకారోత్సవానికి అన్నా లెజ్నెవా హాజరయ్యారు. అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్‌లో ఫోటోలు దిగారు. తన భర్త ప్రమాణస్వీకారం చేస్తుండగా వీడియో తీసుకున్నారు. అన్నా లెజ్నెవా ఒక రష్యన్ మోడల్. 1980 లో రష్యాలో పుట్టింది. అనేక సౌత్ సినిమాలకు కూడా పనిచేసింది.అన్నా లెజ్నెవా కూడా తీన్ మార్ లో ప్రధాన పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా తీన్ మార్ లో కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2013లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2017లో అన్నా లెజ్నెవా, పవన్‌ల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు. అన్నా లెజ్నేవా మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం తీసుకున్నారు. విడిపోయిన తర్వాత అన్నా లెజ్నెవాకు పవన్ కల్యాణ్ తో రెండో వివాహం జరిగింది.