Pawan Kalyan- CM Chandrababu రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించిన ముఖ్యమంత్రి, త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.
READ MORE: India UNSC Veto Power: UNSCలో భారత్‌కు వీటో పవర్ దూరం చేస్తుంది ఏంటి? ఇండియా కల నెరవేరుతుందా!
అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొద్ది రోజులు కిందట అస్వస్థతకు గురయ్యారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన, మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. వైద్యుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జ్వరంతో పాటు తీవ్రమైన దగ్గు కూడా ఉండటంతో నీరసించిపోయినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో, హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఇటీవల మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆరోగ్యం సహకరించకపోయినా, పవన్ కళ్యాణ్ తన అధికారిక విధులకు ఆటంకం కలిగించలేదు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూనే సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ రోజు రాత్రి నుంచి జ్వరం తీవ్రత మరింత పెరిగినట్లు సమాచారం.
READ MORE: Aghori-Sri Varshini: ఇక నా జోలికి వస్తే అంతే సంగతి.. అఘోరీకి శ్రీ వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్..
