అమరావతి : ఏపీలో డ్రగ్స్, గంజాయి మాఫియాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 2018 లోనే ఏపీ-ఒడిస్సా బోర్డరులో గంజాయి రవాణ, మాఫియా వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయంటూ ట్వీట్ చేశారు పవన్. డ్రగ్స్ మూలాలు ఏపీలోనే ఉన్నాయంటూ హైదరాబాద్ సీపీ నల్గొండ ఎస్పీ ప్రకటనల క్లిప్పిగులను ట్వీట్టర్లో పోస్ట్ చేసిన పవన్.
ఏపీ-ఒడిశా బోర్డరులోని గిరిజన ప్రాంతాల్లో 2018లో చేపట్టన పోరాట యాత్రలో గంజాయి మాఫియాపై చాలా ఫిర్యాదులు వచ్చాయని… ఆరోగ్య, ఉపాధి, అక్రమ మైనింగ్ వంటి సమస్యల గురించి అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఏపీ నార్కొటిక్ డ్రగ్సుకు హబ్ గా మారిందని…. ప్రతి చోట డ్రగ్ లార్డ్స్ తయారయ్యారని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. డ్రగ్స్ విషయంలో ఏపీ కారణంగా దేశం మొత్తం ఎఫెక్ట్ అవుతోందని… ప్రభుత్వం.. నేతలు డ్రగ్స్ నివారణపై ఉద్దేశ్యపూర్వకంగానే చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
