Site icon NTV Telugu

Pawan Kalyan: ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరేయాలి.. మనకి కనికరం ఎక్కువైపోయింది!

Pawan

Pawan

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 23, 2025 (బుధవారం) జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదనరావు మరణించారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది.

Erracheera: ఎర్రచీర…పట్టుకుంటే ఐదు లక్షలు!

ఏప్రిల్ 24, 2025 (గురువారం) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలిలోని మధుసూదనరావు నివాసానికి వెళ్లి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఉగ్రదాడిలో మధుసూదనరావు మరణించడం దురదృష్టకరమని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. అలాగే, కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతేకాక ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరేయాలి, మనకి కనికరం ఎక్కువైపోయింది అని అన్నారు .

Exit mobile version