Pawan Kalyan: గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి బాధాకరమన్నారు. కురుపాంలోని బాలికల గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడి పిల్లలు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు చెప్పారన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లు వివరించారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. విశాఖపట్నం కేజీహెచ్ లో 37 మంది విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకొని నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు వివరించారు. త్వరలో కురుపాం వెళ్ళి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు..
READ MORE: Brahmanandam: బ్రహ్మానందం కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా..?
ఇదిలా ఉండగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో అనారోగ్యంతో గిరిజన విద్యార్థినుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పార్వతీపురం పరిధిలోని కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండిస్ లక్షణాలతో విద్యార్థినుల వరుస మరణాలు సంచలనం రేపుతున్నాయి. గత ఐదు రోజులలో అనారోగ్యంతో ఇద్దరు విద్యార్థినులు చనిపోయారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక కల్పన నేడు విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మృతి చెందగా, గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖళ్లు పంచాయతీ కంబగూడ గ్రామానికి చెందిన పువ్వల అంజలి గత నెల 26వ తేదీన మృతి చెందింది.
