పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూనే వారాహి యాత్రతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.పక్కా ప్రణాళికతో కొంత సమయం కూడా వృధా కాకుండా తన డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.నిన్నటి వరకు పొలిటికల్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న పవన్ మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో వున్న తాజా సినిమాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘ఓజీ’. తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో అడుగుపెట్టారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసిన సినిమా యూనిట్ ఈ సినిమా మాసీవ్ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించనున్నారు. ఈ లెంతీ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం భారీ సెట్‌ను నిర్మించారు. ఈ షెడ్యూల్ లో పవర్ స్టార్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం. .
ఈ షెడ్యూల్ పూర్తి తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ హీరోయిన్ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ 15 రోజుల షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ కోసం దాదాపు 30 రోజుల డేట్స్ కేటాయించనున్నట్టు సమాచారం.. ఓజి తరువాత షెడ్యూల్ బ్యాంకాక్ లో జరుగనున్నట్లు సమాచారం.అక్కడ ప్రీ క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ 45 రోజుల సమయాన్ని పవన్ ఈ రెండు చిత్రాలకు సమయం కేటాయించారని తెలుస్తుంది. మరి ఎప్పటి నుంచో హోల్డ్ లో వున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు.