NTV Telugu Site icon

Hari Hara Veera Mallu : పవన్ కల్యాణ్, క్రిష్ కాంబో మూవీ ఆగిపోయినట్లేనా..?

Whatsapp Image 2024 02 08 At 9.50.42 Am

Whatsapp Image 2024 02 08 At 9.50.42 Am

క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గత కొన్ని ఏళ్లుగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో మణికర్ణిక మూవీని ఇలాగే సగానికిపైగా షూట్ చేసిన తర్వాత ఆ మూవీ లీడ్ కంగనా రనౌత్ తో పడకపోవడంతో క్రిష్ ఆ మూవీని మధ్యలోనే వదిలేశాడు. ఇప్పుడు హరి హర వీర మల్లు విషయంలోనూ అదే జరిగినట్లు కనిపిస్తోంది.హరి హర వీర మల్లు మూవీ ఎప్పుడో నాలుగేళ్ల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు అప్పుడు అంటూ ఆరు నెలలకోసారి ఏదో అప్డేట్ వచ్చినా కానీ సినిమా మాత్రం అక్కడే ఉండిపోయింది. ఈలోపు పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మరియు బ్రో మూవీస్ రిలీజయ్యాయి.

తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ మూవీ కూడా రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు.అయినా హరి హర వీర మల్లు పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు పవన్ అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అతడు అనుష్క శెట్టితో ఓ కొత్త సినిమాను ప్రారంభించాడు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ అయిన ఈ ప్రాజెక్ట్ ఓ భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.గతంలో వేదం సినిమాలో క్రిష్ డైరెక్షన్ లో నటించిన అనుష్క..ఆ సినిమాలో సరోజ పాత్రలో అదరగొట్టింది. అయితే ఈ మధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో మళ్లీ సినిమాలు మొదలుపెట్టిన అనుష్క.. ఇప్పుడు క్రిష్ తో మరో మూవీ చేస్తోంది. దీనితో క్రిష్ హరి హర వీర మల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా మిగిలిపోయిన షూటింగ్ ను మరో డైరెక్టర్ పూర్తి చేస్తాడనీ వార్తలు వస్తున్నాయి.

Show comments