Pawan Kalyan Kondagattu, Dharmapuri Tour Schedule: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. అటు జనసేన, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలు దర్శించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన వాహనం వారాహికి సంప్రదాయ పూజ చేయించనున్నారు. ఈనెల 24వ తేదిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగలి ప్రమాదానికి గురికాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తలపెట్టిన అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు. రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
పూజా కార్యక్రమం అనంతరం, తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.
Payyavula Keshav: ఏకాభిప్రాయం తర్వాతే.. రిమోట్ ఓటింగ్ మెషిన్ విధానాన్ని అమలు చేయాలి