Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని చిలకలూరిపేట మెగా పేరెంట్స్‌ మీటింగ్‌లో ఓ మాట ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. ఇచ్చిన మాట ప్రకారం.. శారదా హైస్కూల్‌ లైబ్రరీకి పుస్తకాలు, 25 కంప్యూటర్లు, ల్యాబ్‌ పరికరాలు అందించారు. ఎమ్మెల్యే పుల్లారావు, కలెక్టర్‌ కృతిక శుక్లా కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

READ MORE: Minister Seethakka : పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

కాగా.. ఈ నెల 5న చిలకలూరిపేట ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం తెలిపారు. మైలవరపు కృష్ణ తేజ తాతగారు గుండయ్య పేరుతో కూడలి ఉండటం ఆయన సేవా నిరతిని గుర్తు చేసిందన్నారు. అప్పట్లో పెద్దలు పాఠశాలలకు స్థలాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు కొందరు స్థలాలు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాల గురించి మాట్లాడారు. పిఠాపురంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవను కులాలకు అంటగట్టారని మండిపడ్డారు. కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉంటాయని, క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాల కారణంగా పిల్లల బలాబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చిన హామీని తాజాగా డిప్యూటీ సీఎం నెరవేర్చారు.

READ MORE: IPL 2026 Auction: పవర్ హిట్టర్‌పై కన్నేసిన ఆర్సీబీ.. 8 మందిలో ఇద్దరు విదేశీలకు ఛాన్స్!

Exit mobile version