ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేయనున్నారు. జనసేన జనవాణి కార్యక్రమం పేరుతో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు చేసిన జనవాణికి భారీగా స్పందన వచ్చింది. విశాఖలో కార్యక్రమానికి భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. జనవాణి దగ్గర భారీగా పోలిసులు మోహరించారు. జనసేన ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేశారు. కళావాణి అడిటోరియంకి వినతులు తీసుకుని వస్తున్న జనంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నిన్నటి ఎయిర్ పోర్ట్ ఘటనతో పోలీసుల హై అలెర్ట్.. వైసీపీ కార్యకర్తలు వస్తారనే సమాచారంతో అప్రమత్తం..పవన్ బస చేసిన హోటల్ దగ్గర నుండి కళావాణి ఆడిటోరియం వరకు దారి పొడవునా హై సెక్యురిటీ ఏర్పాటుచేశారు.. కాసేపట్లో కళావాణి అడిటోరియానికి రానున్నారు పవన్.
-
విశాఖ పోలీసులు పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన నోటీసు ఇదే
పవన్ కళ్యాణ్ కి విశాఖపట్నం పోలీసులు ఇచ్చిన సెక్షన్30 కింద నోటీసు ఇదే. Airport ఘటనపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. నిన్నటి దాడి ఘటనతో సంబంధం లేదన్నారు పవన్ కళ్యాణ్. తాను వచ్చేసరికే ఘటన జరిగిందన్నారు. రుషికొండ అక్రమాలు బయటపెడతామనే డ్రోన్ రద్దుచేశారన్నారు.
-
కళావాణి ఆడిటోరియంలో వినతుల స్వీకరణ
విశాఖ కళావాణి ఆడిటోరియంలో జనసేన నేతలు , పార్టీ ప్రతినిధులు ఆధ్వర్యంలో వినతులు స్వీకరణ జరుగుతోంది. వచ్చిన అర్జీదారులు నుంచి వినతులు తీసుకుని పవన్ దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్తున్నారు ప్రతినిధులు.
-
పవన్ తో పాటు జనసేన నేతలకు నోటీసులు
పవన్ తో పాటు జనసేన నేతలకు నోటీసులు అందచేశారు విశాఖ పోలీసులు. నోవాటెల్ లో వున్న పవన్ దగ్గరికి వచ్చారు విశాఖ పోలీసులు. ర్యాలీలు, ప్రదర్శనలు, సమావేశాలకు అనుమతిలేదన్నారు పోలీసులు. ఏసీపీ హర్షిత పవన్ కు జనసేన నేతలకు నోటీసులిచ్చారు. ఈ నెలాఖరు వరకూ పోలీస్ యాక్ట్ 30 అమలులో వుంది. సాయంత్రం 4 గంటల లోగా విశాఖను విడిచివెళ్ళాలని ఆదేశాలు. 41 ఎ నోటీసులు ఇచ్చిన పోలీసులు.
-
12 మందికి బీమా చెక్కుల పంపిణీ
గతంలో ఏ పార్టీ నిర్వహించని విధంగా జనసేన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ చేశారు పవన్ . 5 లక్షల రూపాయల చెక్కులిచ్చారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో జనవాణిలో ఇవ్వాల్సిన చెక్కుల్ని పవన్ ప్రెస్ మీట్లో అందచేశారు. జనవాణి కార్యక్రమం రద్దు అవ్వడంతో నేరుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కు వచ్చారు ఫిర్యాదుదారులు.
-
మమ్మల్ని ఎందుకింత ఇబ్బందిపెడుతున్నారు-పవన్
ఎదురుదాడి చేసేవారి విషయంలో చట్టం చాలా బలహీనంగా పనిచేస్తోంది. అడిగేవాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.. ఒక కులం గురించే మాట్లాడితే కుదరదు.. రెండుచోట్ల ఓడిపోయిన వారి విషయంలో ఎందుకింత ఇబ్బందులు పెడుతున్నారు.ఏదో భయం వీరికి వుంది. ప్రజల ఆలోచనలను మారుస్తామని భయపడుతున్నారు. నన్ను తిట్టేవారు కాపు సామాజిక వర్గం వారు నాకు బొడ్డు కోసి పేరు పెట్టావా? వాళ్ళ మెచ్చుకోళ్ళ కోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా?అని పవన్ మీడియా సమావేశంలో మండిపడ్డారు.
-
Pawan Kalyan Press Meet Live: పవన్ కళ్యాణ్ కు పోలీసుల నోటీసులు
విశాఖ :పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు.. సాయింత్రం 4 గంటలోగా నగరం/ హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది నోటీసు సారాంశం.. పోలీసులతో కొనసాగుతున్న చర్చలు.. పోలీసులు ఇచ్చే నోటీసులు తీసుకొనే యోచనలో పవన్.. మీడియా సమక్షంలో తీసుకుంటామంటున్న పవన్ కళ్యాణ్
-
పవన్ కు 41 ఏ నోటీసులు
విశాఖ :పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు.. సాయింత్రం 4 గంటలోగా నగరం/ హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది నోటీసు సారాంశం.. పోలీసులతో కొనసాగుతున్న చర్చలు.. పోలీసులు ఇచ్చే నోటీసులు తీసుకొనే యోచనలో పవన్.. మీడియా సమక్షంలో తీసుకుంటామంటున్న పవన్ కళ్యాణ్
-
నోవాటెల్ హోటల్ దగ్గర ఉద్రిక్తత
నోవాటెల్ హోటల్ దగ్గర ఉద్రిక్తత.. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నోవాటెల్ దగ్గరికి వస్తున్న జనసైనికులు.. నోవాటెల్ పరిసరాల్లో జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. విశాఖ నోవాటెల్ హోటల్ లో ఎగ్జిట్ గేట్ క్లోజ్ చేసి ఎంట్రీ గేట్ నుంచి వాహనాలను బయటికి పంపుతున్న పోలీసు అధికారులు. అధిక సంఖ్యలో నోవా టెల్ హోటల్ చుట్టూ మోహరించిన పోలీస్ యంత్రాంగం.నోవాటెల్ హోటల్ లోకి వెళుతున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీస్ అధికారులు. హోటల్ చుట్టూ తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు
-
మీరూ చేసుకోండి మూడు పెళ్లిళ్లు-పవన్
నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న మూడు రాజధానులు పెట్టాలా ? మీరు చేసుకోండి మూడు పెళ్లిళ్లు. నేను చేసుకున్నా అని మీకు ఈర్ష. నాకు కుదరలేదు అందుకే మూడు చేసుకున్నా.. విశాఖ ఆల్రెడీ రాజధాని... కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అదే శ్రీకాకుళం జిల్లాను రాజధానిగా చేస్తే నేను వ్యతిరేకిస్తానా? మూడు రాజధానులు అనేది ఒక వంక మాత్రమే. విశాఖ ప్రశాంత నగరం అలాంటి చోట గొడవలు చూస్తే బాధగా ఉందన్నారు.
-
వారికి గొడవ కావాలి.. మాకు శాంతి కావాలి-పవన్
కోడికత్తి వాళ్ళే పొడిపించుకోని వాళ్ళే పరిష్కారం చేసుకున్నారు. ఆ కేసు ఏం చేసారో తెలియదు. వారికి గొడవ కావాలి అందుకు వారే ప్లాన్ చేసుకున్నారు. అందుకు పోలీసులు సెక్యూరిటీ లేదు. ధర్మాన 70 ఎకరాలు సైనికుల భూములు దోచుకున్నారని చేపుతున్నారు సైనికులు భూమికి రక్షణ లేకపోతే ఎలా? దమ్ముంటే ఆ భూములు రిలీజ్ చేయాలన్నారు పవన్ కళ్యాణ్.
-
జనసేన కార్యకర్తల్ని విడుదల చేయాలి-పవన్
అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తల్ని విడుదల చేయాలి. వారంతా విడుదల కావాలి. అప్పుడే కార్యక్రమం వుంటుంది. రాజకీయాల్లో నేరమయ రాజకీయాలు వుండకూడదు. జనసేన నేతల్ని అరెస్ట్ చేశారు. ప్రెస్ మీట్ కి రాకుండా అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వుండకూడదని భావిస్తున్నాం. పోలీసులతో గొడవ పెట్టుకోవాలని మేం భావించడం లేదు. విశాఖ శాంతియుత ప్రాంతం. ఇక్కడ ఇబ్బందులు సృష్టించకూడదు. చిన్న మనుషులం కదా మేం భరిస్తాం. మా పోరాటం ఆగదు. ఎటుపోతుందో తెలీదు. మా నాయకులు వచ్చేవరకూ జనవాణి జరగదు. జనసేన రాష్ట్ర నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు..హత్యాయత్నం కేసులు ఎలా పెడతారు. మీమీద ఎన్ని కేసులు పెట్టాలి.
-
వైసీపీ గూండాలకు మేం భయపడం-పవన్
తాటాకు చప్పుళ్ళు, చంపేస్తామని బెదిరిస్తే మేం భయపడం. మార్పు కోసం వచ్చాం. నేను, నా జనసైనికులు, వీర మహిళలు భయపడరు. మమ్మల్ని అడ్డుకునే శక్తి మీకు లేదు. మా జనవాణి జరగకూడదని భావిస్తున్నారు. జనసైనికులు వందమందిని అరెస్ట్ చేశారు. మా కెమేరాలు తీసికెళ్లిపోయారు. నా కారు తాళాలు కావాలని అర్థరాత్రి గొడవ చేశారు. ఈ కార్యక్రమం ఎలా తీసికెళ్లాలో మాకు తెలుసు. మీ గూండాగిరీ ఎలా ఎదుర్కోవాలో తెలుసు. మేం కులస్వామ్యాన్ని, ఏకవ్యక్తి స్వామ్యాన్ని నమ్మం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం.
-
వికేంద్రీకరణ అక్కడ అవసరం లేదా?-పవన్
గ్రామాల్లో వికేంద్రీకరణ లేదు.గ్రామపంచాయితీలను నిర్వీర్యం చేశారు. ఒక వ్యక్తి అంతా నిర్దారిస్తారు. లక్షలాది మత్స్యకారులు వున్నారు. వారిని ఒకరు నియంత్రిస్తారు. భవన నిర్మాణ కార్మికుల నిధి మళ్ళించేశారు. ఇసుక హక్కులు ఒకరికి ధారాదత్తం చేశారు. గొడవ పడడం, బూతులు తిట్టడానికి వికేంద్రీకరణ కావాలి. 6 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేయాలి. మూడేళ్ళు దాటినా అమలు కాలేదు. పరిశ్రమలు వెళ్ళిపోయాయి. రాష్ట్రం ఏం నడవాలనేది ఒక వ్యక్తి నిర్ణయిస్తారు. అసలు డిసెంట్రలైజేషన్ గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు.
-
రాజు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా?-పవన్
ఉత్తరాంధ్ర మీద, రాయలసీమ మీద ప్రేమ వుందా? ఇంతమంది సీఎంలు వచ్చారు. ఎందుకు సీమ వెనుకబడి వుంది. ఉత్తరాంధ్రలో ప్రజల్లో వెనుకబాటు తనం వుంది. అధికార వికేంద్రీకరణ అనేది మీ సిద్ధాంతం. 48 శాఖలు, 26 మంది మంత్రులు, 5 డిప్యూటీసీఎంలకు అధికారాలు పంచాలి కదా. ఒక వ్యక్తి కేంద్రంగా సాగుతోంది. వైసీపీ నేతలు చిలుకపలుకలు పలుకుతారు. బూతులు రాసిస్తే వారిని తిట్టేసి వెళ్ళిపోతారు. వికేంద్రీకరణ అనేది మీకు వర్తించదు. వివిధ కార్పోరేషన్లకు నిధులు లేవు.
-
పోలీసులు ఎవరిమీద జులుం చూపిస్తున్నారు?
అధికారులు మామీద జులుం చూపించారు. ప్రభుత్వానికి అండగా వున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులంటే నాకు గౌరవం లేదన్న వ్యక్తి సీఎం. ఆయన దగ్గర మీరు పనిచేస్తున్నారు. మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారట అంటూ జనసేన కార్యకర్తలు ఫోన్లు చేశారు. నన్ను లిఫ్ట్ చేయాల్సిన అవసరం వుంది. మేం ఏమన్నా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం. గంజాయి సాగు చేసేవారిని వదిలేయండి. దేశంలోనే మొదటి స్థానంలో వుంది. సామాన్యుల గొంతు వినిపించడానికి వచ్చిన జనసేనను ఇబ్బంది పెట్టండి. దోపిడీదారులకు, నేరస్థులకు కొమ్ముకాయండి.. ప్రజాసమస్యలు వినిపించేవారి గొంతు నొక్కేయండి.
-
వైజాగ్ దాడులపై పవన్ సంచలన ప్రెస్ మీట్
ఉత్తరాంధ్ర పర్యటనను మూడునెలల ముందే ఖరారుచేశాం. మా పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైసీపీ చెబుతుందా? వైసీపీ మూడురాజధానుల కార్యక్రమానికి ముందే మా ప్రోగ్రాం ఖరారుచేశాం. ప్రభుత్వంతో పోటీ మాకెందుకు. ఎన్నికల టైంలోనే పోటీ వుంటుందన్నారు పవన్ కళ్యాణ్.
-
మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం
మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో నోవాటెల్ దగ్గర భారీగా మొహరించిన పోలీసులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నోవాటెల్ మీదుగా వాహనాలు రాకపోకలు నిలిపివేసిన పోలీసులు. నోవాటెల్ లోకి జనసేన కార్యకర్తలను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులు. జనసేన నాయకులు అరెస్ట్, జనవాణి కార్యక్రమం నిర్వహణ గురించి మాట్లాడే అవకాశం వుంది.
-
కళావాణి ఆడిటోరియం దగ్గర టెన్షన్... టెన్షన్
విశాఖలో పవన్ కళ్యాణ్ టూర్ వేడిని రాజేస్తోంది. కళావాణి అడిటోరియం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆడిటోరియం గేటు లోపల జనసేన కార్యకర్తలు వుండగా.. గేటు బయట వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
-
ఆడిటోరియం వద్దకు వైసీపీ నేతలు
జనసేన నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం వాడివేడిగా సాగుతోంది. పోర్ట్ స్టేడియంలోని ఆడిటోరియం దగ్గరకు వచ్చారు వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కో ఆర్డినేటర్ కె కె రాజు, వైసిపీ కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
-
పవన్ అరెస్ట్ వార్తలు అవాస్తవం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు...పోర్ట్ స్టేడియంలో జరగబోయే జనవాణి కార్యక్రమ ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ తో చర్చిస్తున్నాం.. పోలీస్ అధికారుల వివరణ ఇచ్చారు. మరోవైపు ఆడిటోరియం దగ్గర పవన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు మహిళలు.. వారిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. మూడురాజధానులకు మద్దతు ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతోంది. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.