Site icon NTV Telugu

Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు డేట్స్ కేటాయించిన పవర్ స్టార్..?

Whatsapp Image 2023 07 25 At 3.54.27 Pm

Whatsapp Image 2023 07 25 At 3.54.27 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ ”హరిహర వీరమల్లు”.జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రారభించి మూడేళ్లు గడుస్తున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.ఈ సినిమాను ప్రారంభించిన మొదట్లో సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు.ఎందుకంటే. ఈ సినిమా మేకర్స్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.ఏ ముహూర్తాన ఈ సినిమా స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తూ వస్తుంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు క్రిష్ ఆ మిగిలిన భాగం కూడా పూర్తి చేసి విడుదల చేయాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సినిమాలకు డేట్స్ కేటాయించి ఆ సినిమాలను స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా కోసం ఎక్కువగా డేట్స్ ఇవ్వాల్సి ఉండడంతో పవన్ ప్రకటించిన సినిమాలు అన్నింటిని చకచక పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జెస్ట్ చేసినట్లు సమాచారం.సెప్టెంబర్ మొదటి వారం నుండి పవన్ వీరమల్లు కోసం డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.. ఈ సినిమా కోసం 10 రోజుల డేట్స్ ఇచ్చారని సమాచారం.ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు..నోరా ఫతేహి ఈ సినిమా లో మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version