NTV Telugu Site icon

Pawan Kalyan: గౌతమ్ రాజు మృతి విచారకరం

Pavan Kalyan Condolences To Gowtham Raju

Pavan Kalyan Condolences To Gowtham Raju

ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మృతిపట్ల నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతమ్ రాజు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎడిటర్‌గా వందల చిత్రాలకు పనిచేసిన అనుభవశాలి అంటూ ఆయనను కీర్తించారు. ఆ విభాగంలో సాంకేతికంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను అందిపుచ్చుకొన్నారని వెల్లడించారు.

Chiranjeevi: గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరం

తాను నటించిన ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘గబ్బర్ సింగ్’, ‘గోపాల గోపాల’ చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Pavan Kalyan

Pavan Kalyan