Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లు అందరికీ అభినందనలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని వెల్లడించారు. 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని తెలిపారు. రూ. 4,330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నేరుగా నుంచి చెల్లించామన్నారు. గ్రామ పంచాయితీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు.. కేంద్ర పథకాల అమలులో వంద శాతం ఫలితాలు సాధించిన అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లను అభినందించారు. “విజన్‌ ఉన్న నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాం.. 18 నెలల్లో దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటే అది ఒక చరిత్ర.. లోకేష్‌ ఆలోచనలతో యువతకు ఉపాధి కల్పన దిశగా ముందుకెళ్తున్నాం.. ఇంటింటికి సంక్షేమం, సంపద పంపిణీ లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నాం..” అని కలెక్టర్ల సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

READ MORE: Bhumana Karunakar Reddy: టీటీడీకి తీరని ద్రోహం జరుగుతోంది.. మాజీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు..

Exit mobile version