అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. ప్రార్థనలు చేసి అందరికీ స్వాంతన చేకూర్చే పాస్టర్ అకృత్యానికి పాల్పడ్డాడు. అంబాజీపేట (మం) పుల్లేటికుర్రులో బాలికపై అకృత్యానికి పాల్పడ్డారు పాస్టర్ బెజవాడ హోసన్న. బాలికను గర్భవతిని చేసి పుట్టిన బిడ్డను మాయం చేశాడా పాస్టర్. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనంగా మారింది. పుల్లేటికుర్రు శివారు చీకురుమిల్లివారి పేటలో పాస్టర్ బెజవాడ హోసన్న నిర్వహించే చర్చిలో సభ్యురాలిగా 17 ఏళ్ల బాలిక ఉంది. తల్లి లేని బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు పాస్టర్.
Read Also: Jyotiraditya Scindia: మీరు ట్రోల్‌గా మారారు.. రాహుల్ కు సింధియా కౌంటర్
గత నెల ఐదున మగ బిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలిక. తన పాపం బయటపడకుండా ఆ బాలికకు పుట్టిన వెంటనే బిడ్డను మాయం చేశాడు పాస్టర్. నెల రోజులు గడుస్తున్నా బిడ్డ ఆచూకీ లేకపోవడంతో బాలిక బంధువులు అనుమానం వ్కక్తం చేశారు. బిడ్డను అమ్మేసి ఉంటాడని లేదా చంపేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ , ఎస్పీలకు బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మగశిశువు ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని బాలిక బంధువులు కోరుతున్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నగర శివారు అటవీ ప్రాంతం శేషాచలపురం లో కస్తూరి (40) అనే మహిళ దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. గత పదేళ్ళుగా ఆమెతో సహజీవనం సాగిస్తున్న శ్రీరాములు హత్య చేసినట్టు పోలిసులు నిర్ధారణకు వచ్చారు. శ్రీరాములును అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నారు తాలుకా పోలీసులు.
Read Also: Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్.. తన ఆర్ట్ కాపీ కొట్టారంటూ..