NTV Telugu Site icon

Metro Train: మెట్రో ట్రైన్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణికులు

Godava

Godava

లండ‌న్ అండ‌ర్‌గ్రౌండ్ రైలులో ప్రయాణికులు కొట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ గ్యాంగ్ మ‌రో గ్యాంగ్‌పై దాడులు చేస్తున్నట్ల మనం చూడొచ్చు.. ఓ వ్యక్తిని ప‌ట్టుకుని మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అత‌న్ని కొట్టడంతో పాటు మెట్రో ట్రైన్ డోర్ దగ్గరకు లాగి మ‌రీ కుస్తీ పట్టారు. ఈ ఘ‌ట‌న శ‌నివారం రాత్రి జ‌రిగినట్లు తెలుస్తుంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచార‌ణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు వ్యక్తులు ఒక‌ర్ని కొడుతుండ‌గా మ‌రో వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇంత‌కీ ఎందుకు ఈ గొడ‌వ జ‌రిగిందో ఇప్పటి వరకు తెలియ‌లేదు.

Read Also: MLA Koneti Adimulam: టీడీపీతో టచ్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! రేపో మాపో సైకిల్‌ ఎక్కే అవకాశం..!

అయితే, రెండు గ్యాంగ్‌లు కొట్టుకుండ‌గా అక్కడ ఉన్న ప్యాసింజర్లు అరుపులు, కేక‌లు వేశారు. ఈ దాడి ఆపాలని కోరారు. కానీ వాళ్లు మాత్రం విన‌కుండా అలాగే ఫైట్ చేశారు. లండ‌న్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగి ఒక‌రు ఆ కొట్లాట‌ను ఆపే ప్రయత్నం చేశాడు.. కానీ వారు మాత్రం ఆగలేదు.. దీంతో ఈ ఘ‌ట‌న గురించి బ్రిటీష్ ట్రాన్స్‌పోర్టు పోలీసులు ఓ ట్వీట్ చేశారు. ద‌ర్యాప్తు జ‌రుగుతుంది.. స‌మాచారం తెలిస్తే త‌మ‌కు చెప్పాల‌ని ఆ ట్వీట్‌లో వారు కోరారు.

Show comments