Viral : ఎక్కడి నుంచి వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లో రూ.64 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : బంగారం, డ్రగ్స్, ఫారెన్ కరెన్సీలను అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. వాటన్నింటినీ కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు. అయినా ఎప్పటికప్పుడు వారు రూట్ మార్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఒక వ్యక్తి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. తన ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లో రూ.64 లక్షల విలువైన విదేశీ కరెన్సీని దాచాడు. దీనిని పసిగట్టిన కస్టమ్స్ అధికారులు ఆ నోట్లను బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చెకింగ్ సిబ్బందిని డైవర్ట్ చేసేందుకు అతడు శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు.
Read Also:Odisha Minister : కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూత
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అంతర్జాతీయ డిపార్చర్ వద్ద ఉన్న కస్టమ్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అతడి ట్రాలీ బ్యాగ్‌ను ఎక్స్‌రే స్కానర్‌తో తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లో విదేశీ కరెన్సీ ఉన్నట్లు కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి అందులో దాచిన విదేశీ నోట్లను సూది, దారం సహాయంతో బయటకు తీశారు. 68,400 యూరోల విలువైన 200 డినామినేషన్ ఉన్న 342 నోట్లు, 5,000 న్యూజిలాండ్ డాలర్ల విలువైన 100 డినామినేషన్ ఉన్న 50 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. భారత కరెన్సీలో వీటి విలువ రూ.64 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విదేశీ కరెన్సీ కలిగిన వ్యక్తిని సురీందర్ సింగ్ రిహాల్‌గా గుర్తించారు. దీనిపై దర్యాప్తు కోసం కస్టమ్స్ అధికారులకు అతడ్ని అప్పగించారు.
#CISFTHEHONESTFORCE
Vigilant #CISF personnel apprehended a passenger carrying foreign currency (worth approx. Rs 64 lakh) ingeniously concealed in the handles of his trolley bag @ IGI Airport, New Delhi. The Passenger was handed over to Customs.@HMOIndia
@MoCA_GoI pic.twitter.com/oLyHkxAOr2— CISF (@CISFHQrs) January 29, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!