NTV Telugu Site icon

Djokovic vs Alcaraz: అల్‌కరాజ్‌తో ఫైనల్‌.. జొకోవిచ్‌ స్వర్ణ స్వప్నం నెరవేరేనా?

Novak Djokovic Olympic

Novak Djokovic Olympic

Novak Djokovic vs Carlos Alcaraz Final Fight in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టెన్నిస్‌ అభిమానులు కోరుకున్న స్టార్స్ నొవాక్‌ జకోవిచ్, కార్లోస్‌ అల్కరాస్‌ గోల్డ్ మెడల్ కోసం తలపడబోతున్నారు. టెన్నిస్‌ ప్రపంచం కళ్లప్పగించి చూసే ఈ ఆసక్తికర పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది.

సుదీర్ఘ కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్‌ స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్‌ జకోవిచ్ అడుగు దూరంలో ఉన్నాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌ క్రీడల్లో పోటీపడుతున్న 37 ఏళ్ల జొకోవిచ్‌.. తొలిసారి పసిడి పోరుకు అర్హత సాధించాడు. పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ సెమీఫైనల్లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టిపై గెలిచి.. ఒలింపిక్స్‌ టెన్నిస్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన పెద్ద వయసు్కడిగా రికార్డులో నిలిచాడు.

Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్.. లక్ష్యసేన్‌ సాధించేనా?

టోర్నమెంట్ అంతటా నొవాక్‌ జకోవిచ్ అద్భుతంగా ఆడాడు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుని.. పారిస్‌లో కనీసం రజత పతకంను ఖాయం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల వరుసగా గ్రాండ్‌స్లామ్‌లు గెలుస్తున్న కార్లోస్‌ అల్కరాస్‌పై గెలవాలంటే సెర్బియా దిగ్గజం శ్రమించాల్సిందే. వింబుల్డన్‌ 2024 ఫైనల్లో జకో ఓడిన విషయం తెలిసిందే. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన జకోవిచ్.. 2012 లండన్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.

 

Show comments