NTV Telugu Site icon

Paris Olympics 2024: ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌.. 40 స్వర్ణాలతో టాప్‌లో అమెరికా! భారత్ స్థానం ఎంతంటే

Paris Olympics Medal Tally

Paris Olympics Medal Tally

India Won 6 Meals in Paris Olympics 2024: పారిస్‌ వేదికగా గత 19 రోజులుగా అలరించిన ఒలింపిక్స్ ముగిశాయి. ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు సైతం ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ముగిశాయి. జులై 26న విశ్వ క్రీడలు ప్రారంభం కాగా.. ఆగష్టు 11న క్లోజ్ అయ్యాయి. సెన్‌ నది వేదికగా ఒలింపిక్స్ వేడుకలకు బీజం పడగా.. స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో సమాప్తమయ్యాయి. నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. భారత్‌ తరఫున షూటర్‌ మను బాకర్‌, హాకీ దిగ్గజం పీఆర్‌ శ్రీజేష్‌ పతకధారులుగా వ్యవహరించారు. 2028 ఒలింపిక్స్‌ పోటీలు లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్నాయి.

పారిస్‌ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలతో టాప్‌లో నిలిచింది. చివరి రోజు చైనాను వెనక్కి నెట్టిన యూఎస్.. పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఒలింపిక్స్‌ చివరి పోటీలు అయిన మహిళ బాస్కెట్‌బాల్‌లో అమెరికా జట్టు స్వర్ణ పతకాన్ని గెలిచి తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. 40 స్వర్ణ పతకాలు సహా మొత్తంగా 126 పతకాలను యూఎస్‌ సాధించింది.

డ్రాగన్ దేశం చైనా 40 స్వర్ణాలు పాటు మొత్తం 91 పతకాలను తన ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌ 20 బంగారు పతకాలతో మూడు స్థానంలో నిలిచాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్‌.. ఈసారి 71వ స్థానంకు పడిపోయింది. మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనగా.. ఆరు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.

Show comments