NTV Telugu Site icon

Parineeti Chopra-Raghav Chadha: పెళ్లి తర్వాత.. పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా మొదటి ఫోటో!

Parineeti Chopra Raghav Chadha Wedding

Parineeti Chopra Raghav Chadha Wedding

Newlyweds Parineeti Chopra-Raghav Chadha First Photo: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం ‘ది లీలా ప్యాలెస్‌’లో జరిగిన ఈ వేడుకకి పరిణీతి-రాఘవ్ కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్‌ల సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌లు కొత్త జంటను ఆశీర్వదించారు.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి వేడుక ‍మూడు రోజులు ‍అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా కొత్త జంట ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. అయితే వివాహం అనంతరం పరిణీతి-రాఘవ్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పరిణీతి సీక్విన్డ్ పింక్ చీరలో భర్త రాఘవ్ చద్దాతో కలిసి పోజులిచ్చారు. పరిణీతి నుదుటిపై సిందూరం ఉంది. మే నెలలో ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

Show comments