NTV Telugu Site icon

Paralympics 2024 India: పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!

Kapil Parmar

Kapil Parmar

పారిస్‌ పారాలింపిక్స్‌ 2024లో భారత పారా అథ్లెట్లు పతక వేటలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పారాలింపిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన భారత్‌.. ఈసారి పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా అందుకుంది. గురువారం భారత్‌ ఖాతాలో 25వ పతకం చేరింది. పారాలింపిక్స్‌ జూడోలో కపిల్‌ పర్మార్‌ దేశానికి పతకం అందించాడు. పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కాంస్యం సాధించాడు. భారత్‌ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

నేటి షెడ్యూల్ ఇదే:
పారా అథ్లెటిక్స్‌:
పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌54 (దీపేశ్‌ కుమార్‌)- మధ్యాహ్నం 2.07
పురుషుల హైజంప్‌ (ప్రవీణ్‌ కుమార్‌)- మధ్యాహ్నం 3.21
మహిళల జావెలిన్‌ త్రో ఎఫ్‌46 (భావనాబెన్‌)- రాత్రి 10.30
పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 (సోమన్, హొకాతో)- రాత్రి 10.34

పారా పవర్‌లిఫ్టింగ్‌:
మహిళల 67 కేజీల వరకు (కస్తూరి)- రాత్రి 8.30

Show comments