Site icon NTV Telugu

Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు

Parachute Training

Parachute Training

కర్ణాటకలోని బళ్లారి జిల్లా పి.డి. హళ్ళి ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన పారాచూట్ శిక్షణ విన్యాసంలో అవాంతరం సంభవించింది. ల్యాండింగ్ సమయంలో పారాచూట్ సరిగా పనిచేయకపోవడంతో ఇద్దరు సైనికులు సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి గాయపడ్డారు. ఈ శిక్షణలో మొత్తం 417 మంది సైనికులు పాల్గొన్నారు. ఘటనలో గాయపడిన ఇద్దరు సైనికుల్లో ఒకరు 25 ఏళ్ల చిన్నరాజ్ అని తెలుస్తోంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, వారి పరిస్థితి దృష్ట్యా హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు ఏర్‌లిఫ్ట్ చేశారు. అక్కడ అధునాతన వైద్య సదుపాయాలతో చికిత్స కొనసాగుతోంది.

Also Read:Chanakya Niti: మీ శత్రువుపై విజయం సాధించడం ఇక చిటికెలో పని! ప్రపంచాన్ని శాసించిన చాణక్యుడి మాస్టర్ ప్లాన్ ఇదే..

ప్రస్తుతం ఇద్దరు సైనికుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సైన్యం అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పారాచూట్ శిక్షణలో ఇలాంటి అవాంతరాలు అరుదుగా జరిగినప్పటికీ, సైనికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన సైనిక శిక్షణలో ఉన్న రిస్క్‌లను మళ్లీ గుర్తు చేసింది. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Exit mobile version