Site icon NTV Telugu

Papikondalu Tour Cancel: ఇవాళ, రేపు పాపికొండల యాత్ర రద్దు

Papikondalu

Papikondalu

పాపికొండలు అందాల ప్రాంతం.. పర్యాటకులు ఏడాదికి ఒక్కైసారైనా చూడాల్సిన అద్భుతమయిన ప్రాంతం. ఉభయ గోదావరి జిల్లాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలుల తరుణంలో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. ఇవాళ, రేపు విహారయాత్రను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు పోశమ్మగండి కంట్రోల్ రూమ్ అధికారి ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక విహారయాత్రకు అనుమతి ఇస్తామని వెల్లడించింది.

పాపికొండలు…పర్యాటకులకు స్వర్గధామం
పాపికొండల పేరు చెప్పగానే పర్యాటకులు ఉల్లాసంగా ఫీలవుతారు. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. (తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి).

ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.

పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి.పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

Read Also: IT raids: తమిళనాడులో ఐటీ దాడులు.. జి స్క్వేర్‌ సంస్థలో తనిఖీలు

రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదలవుతుంది. అక్కడినుండి పోలవరం, గొందూరు (పోచమ్మ గండి), సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతుంది ఈ పాపికొండలు సినిమా వారికి మంచి షూటింగ్ ప్రాంతం. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి అనేక సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. పర్యాటకులు పోలవరం పూర్తికాకముందే పాపికొండల ప్రాంతాన్ని చూడాలి.

Exit mobile version