Site icon NTV Telugu

Road Accident: మీర్జాపూర్ నటుడి ఇంట తీవ్ర విషాదం..

Manoj Tiwari

Manoj Tiwari

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరి సరితా తివారీ, బావమరిది మున్నా తివారీ రాజేష్ తివారీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్సాలోని జిటి రోడ్డు సమీపంలో జరిగిన ఈ ఘటనలో బావ రాజేష్ తివారీ మృతి చెందాడు. ఇదిలా ఉండగా, సోదరి సరిత తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ధన్‌బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సియులో చికిత్స పొందుతోంది.

Also read: Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… తొమ్మిది మంది మృతి

రాజేష్ తివారీ, ఆయన భార్య సరితా తివారీ బీహార్‌ లోని గోపాల్‌ గంజ్‌ లోని కమల్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌ లోని చిత్తరంజన్‌ కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిర్సా మార్కెట్ చౌక్ చేరుకోవడానికి ముందు, వారి స్పీడ్ కారు డివైడర్‌ ను ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారు పూర్తిగా ధ్వంసమై, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇక ఈ ప్రమాదం తర్వాత, పోలీసులు, స్థానికుల సహాయంతో, ఇద్దరు వ్యక్తులను కారు నుండి వెలికితీసి ధన్‌ బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర వైద్యులు రాజేష్ తివారీ మరణించినట్లు ప్రకటించారు. అత్యవసర చికిత్స తర్వాత, సరితా తివారీని సర్జికల్ ఐసియులో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Also read:PBKS vs GT: మ్యాచ్ గెలిచి క్వాలిఫైర్ లిస్టులో నిలిచేదెవరో..

నటుడు పంకజ్ త్రిపాఠి బావ రాజేష్ తివారీ భారతీయ రైల్వేలో పనిచేశాడు. చిత్తరంజన్‌ లో ఆయన పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం., అతను తన గ్రామం నుండి చిత్తరంజన్ వద్దకు తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. దాంతో ఆయన మరణించాడు.

Exit mobile version