ఓ ప్రభుత్వ ఉద్యోగి తన అటెండెన్స్ కోసం ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఉపయోగించుకున్నాడు. రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు అధికారులు. దీంతో ఆ ఉద్యోగి చేసిన ఘనకార్యం వెలుగుచూసింది. సీఎం ఫోటోతో హాజరు నమోదు చేసిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జగిత్యాల జిల్లా కలెక్టర్.
Also Read:Home Minister Vangalapudi Anitha: వైఎస్ జగన్ అరెస్ట్ పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటోతో ప్రభుత్వ ఉద్యోగి అటెండెన్స్ వేసుకుంటున్నాడు. విధులకు హాజరు కాకుండా యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశాడు పంచాయతీ కార్యదర్శి. కాగా పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించే యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుండే అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉండగా, కొంత మంది రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేపట్టారు.
Also Read:Srushti Test Tube Baby Centre: 5రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత.. జైలు నుంచి తరలించిన పోలీసులు
ఈ తనిఖీల్లో జగిత్యాల జిల్లాలో విధులకు హాజరు కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్న ఒక పంచాయతీ కార్యదర్శి నిర్వాకం చూసి షాకయ్యారు అధికారులు. కొందరు విధులకు వెళ్లకుండా ఇతరుల సహాయంతో తాము లేకుండానే అటెండెన్స్ నమోదు చేసుకోగా, ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నారు మరి కొందరు పంచాయతీ కార్యదర్శులు. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు చేపట్టారు అధికారులు.
