నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గేదె ను ఢీకొట్టింది. ట్రైన్ చక్రాల మధ్య గేదె ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ ట్రైన్ ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. దీంతో నల్లగొండ- మిర్యాలగూడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోకో పైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Simhadri Express Train: గేదెను ఢీకొట్టిన.. పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్..

Simhadri Express Train