Site icon NTV Telugu

Palnadu District: నల్లగా ఉందని వదిలేసిన భర్త.. అత్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య

Palnadu

Palnadu

Palnadu District: పల్నాడు జిల్లా విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.. తన భార్య నల్లగా ఉందని ఓ భార్యను ఆమెను పుట్టింటిలో వదిలేశాడు. దీంతో ఆ భార్య బంధువులతో కలిసి ఏకంగా అత్తమామల ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జిల్లా పరిధిలోని వినుకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుంచి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు రెండు ఎకరాల పొలం అమ్మి 20 లక్షలు డబ్బులు, 20 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారని తెలిపింది.

READ MORE: IPL 2026 Auction: ఫ్రాంచైజీల టాప్ పిక్స్‌ వీరే.. ఈ అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్లపై కాసుల వర్షమే!

అదనపు కట్నం తెమ్మని అత్త మామలు వేధిస్తున్నారు. తిండి కూడా పెట్టకుండా కొట్టి పుట్టింటికి పంపారు. నల్లగా ఉన్నానని భర్త, అశుభాలు జరుగుతున్నాయని మామ, అత్త వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు చెబుతోంది. తల్లి దండ్రులతో కలసి అత్తగారింటికి వెళ్ళగా మాపై దాడికి ప్రయత్నించి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారంటూ బాధితురాలు వాపోయింది.. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో కోడలు గోపి లక్ష్మి అత్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది..

READ MORE: Drug Injection Scam: పాతబస్తీలో జోరుగా మత్తు ఇంజక్షన్ల దందా.. ఎన్టీవీ ఆపరేషన్లో సంచలన విషయాలు!

Exit mobile version