NTV Telugu Site icon

Pallavi Prasanth : శివాజీకి గురుదక్షిణ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అన్నా ఏంటి ఇలా ఝలక్ ఇచ్చావు..

Prasanth Sivaji

Prasanth Sivaji

బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీజన్ మొత్తం పల్లవి ప్రశాంత్ పైనే నడిచింది.. హౌస్ లోకి కామన్ మ్యాన్, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి తన ఆట, మాటతో అభిమానులను సంపాదించుకున్నాడు.. చివరివరకు హౌస్లో తన హవాను కొనసాగిస్తూ ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.. పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, యావర్ ఒక బ్యాచ్గా ఉన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా హీరో శివాజీ అంటే ప్రశాంత్ కు ఎనలేని అభిమానం.. అతనికోసం ఏమైనా చేస్తాడు.. అలాగే శివాజీకి కూడా అతనంటే ఇష్టం..

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరి బంధం ఇలానే కొనసాగుతూ వస్తుంది.. బయట కలుస్తూ వచ్చేవారు.. అలాగే బుల్లితెర పై జరిగే ఈవెంట్స్ లలో కూడా ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు.. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి ఫోటోలు ఇప్పటికి ట్రెండ్ అవుతుంటాయి.. అయితే రీసెంట్ గా వీరిద్దరూ కలిసినప్పుడు పల్లవి ప్రశాంత్ తన గురువు శివాజీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

పల్లవి ప్రశాంత్ గురుదక్షిణగా శివాజీకి కాఫీ పౌడర్ ఇచ్చాడు. ఇది విలువైన బహుమతా అని మీరు అనుకోవచ్చు.. కానీ బిగ్ బాస్ చూసిన వాళ్లకు మాత్రం ఈ గిఫ్ట్ వెనక చరిత్ర గురించి తెలిసే ఉంటుంది.. శివాజీకి కాఫీ అంటే చచ్చేంత ఇష్టం.. ఓ రోజు బిగ్ బాస్ లో కాఫీ లేదని ఎంత తతంగం చేశాడో చూసే ఉంటారు.. అందుకే పల్లవి ప్రశాంత్ తన గుర్తుగా కాఫీ పొడిని ఇచ్చారు.. దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. అన్నా ఏంటి ఇలా ఝలక్ ఇచ్చావు.. గురుదక్షిణ ఇలా చెల్లించుకున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..