Site icon NTV Telugu

Pallavi Prasanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఏం ఇప్పుడు చేస్తున్నాడో తెలుసా?

Pallavi Prasanth (2)

Pallavi Prasanth (2)

బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్‌ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.. ఇక ప్రశాంత్ అభిమానులతో, మెయింట్‌ గేట్‌ నుంచి బయటకు రావడమే దీనంతటికి కారణమైందని పోలీసులు భావించారు..

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ప్రశాంత్ పై ఏడు కేసులు నమోదు అయ్యాయి.. దాంతో పల్లవి ప్రశాంత్ అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. బెయిల్‌ రాకుండా చేశారు. ఏకంగా జైలుకి కూడా పంపించారు. కానీ ఎట్టకేలకు ప్రశాంత్‌కి బెయిల్‌ వచ్చింది. జైలు నుంచి వచ్చిన ప్రశాంత్‌ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు.. కాగా ఇటీవల భోలే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఇచ్చిన చిన్న పార్టీకి పల్లవి ప్రశాంత్ హాజరయ్యాడు.. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకి ఆయన చిన్న గెట్‌ టూ గెదర్‌ పార్టీ నిర్వహించారు. ఇందులో శివాజీ, ప్రశాంత్‌ కూడా హాజరయ్యారు. వీరితోపాటు మరికొందరు కంటెస్టెంట్లు ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రశాంత్‌ మాత్రం ఇకపై మీడియా ముందుకు రాదలుచుకోలేదట. మీడియాకి, పబ్లిక్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నాడట..

ఇక బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల ఎటువంటి వాటిని ఇక చేయబోనని చెప్పిన సంగతి తెలిసిందే.. ఎవరిని కలవను కూడా కలవనని చెప్పాడు.. ఎలాంటి వివాదాలు లేకపోయి ఉంటే, బిగ్‌ బాస్‌ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ హంగామా వేరే ఉండేది. ఆయనకు సినిమా ఆఫర్లు, ఇతర కమర్షియల్‌ ఆఫర్లు వచ్చేవి. ఫుల్‌ బిజీగా ఉండేవాడు. వరుస ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆయన ఇమేజ్‌ మరింత పెరిగిపోయేది.. కానీ షో విన్నర్ అవ్వడం అతనికి శాపంగా మారింది..ఇక ముందు అతడు పొలం పనులకే పరిమితం అవుతాడని తెలుస్తుంది..

Exit mobile version