NTV Telugu Site icon

Palla Rajeshwar Reddy: జనగామలో పల్లా వర్గమో, మరో వర్గమో లేదు, మనమంతా కేసీఆర్ వర్గం..

Palla

Palla

కాంగ్రెస్, టీడీపీ లాంటి‌పార్టీలు పాలించాయి, కానీ ఎవడైనా పథకాలు ఇచ్చాయా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ టికెట్ ఇంకా ప్రకటన జరగలేదు.. కానీ, నాకే అని చెప్పారు.. ప్రకటన‌ కాగానే వస్తాను అంటూ ఆయన పేర్కొన్నారు. గ్రామ‌ల్లో, వార్డుల్లో, మండలల్లో, జనగామ, చేర్యాల పట్టణాల్లో ప్రణాళిక బద్దంగా ముందుకు‌ పోదామని చెప్పారు. సోషల్ మీడియా వారియర్లకు పథకాలపై అవగాహన ఉండాలి.. విమర్శకు ప్రతి విమర్శతో కాకుండా.. బూతుకు బూతుతో కాకుండా సరైన సమాధానం చెప్పాలి అని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.

Read Also: Law Commission: 2024లో ఏకకాలంలో ఎన్నికలు ఉండవు..!

ఎన్నికల్లో సోషల్ మీడియా ఏ విధంగా పాల్గొనాలనేది మాత్రమే ఈ సమావేశం అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అందరితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటా.. లెక్కలతో సమాధానం చెప్పాలి.. సోషల్‌ మీడియాలో‌ పని చేయాలనే ఉత్సాహం ఉన్నవారిని తీసుకుంటాం.. జనగామ టికెట్ ప్రకటన వచ్చిన తర్వాత కూడా పార్టీ నిర్ణయం ఏదైనా శిరోధార్యంగా పనిచేయాలి అని ఆయన తెలిపారు. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గమో, మరో వర్గమో లేదు.. మనం అందరం ముఖ్యమంత్రి కేసీఆర్ వర్గం అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Allu Arjun: పవన్ డైరెక్టర్ తో బన్నీ బాలీవుడ్ సినిమా.. అంత లేదమ్మా.. ఇది మ్యాటర్

ఇక, జనగామలో బీఆర్ఎస్ లో సోషల్ మీడియా వార్ జరుగుతుంది. నేడు జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లడంతో నియోజకవర్గ క్యాడర్, సోషల్ మీడియా వారియర్స్ తో అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఇక, పల్లా రాజేశ్వర్ రెడ్డి రాకపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీలు ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుమతి లేకుండా సమావేశం నిర్వహిస్తే క్యాడర్ లో అయోమయం నెలకొంటుందని సోషల్ మీడియాలో పల్లాకు వ్యతిరేకంగా పోస్టులు వైరల్ చేశారు. ఇప్పటికే జనగామ బీఆర్ఎస్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు వేలిశాయి.