Site icon NTV Telugu

Chemical Factory Blast: కెమికల్ కంపెనీలో భారీ బ్లాస్ట్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

Blast

Blast

Chemical Factory Blast: మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జేపీ పరిశ్రమల నగరంలోని లింబాని సాల్ట్ ఇండస్ట్రీస్ కంపెనీలో కెమికల్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్‌లో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ పరిసరాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. గాయపడిన కార్మికులను సమీపంలోని ఢవలే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పాలఘర్ జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ.. మానోర్ రోడ్డులోని ఈ యూనిట్‌లో కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు పేలుడు జరిగిందని తెలిపారు.

6,500mAh బ్యాటరీ, 50MP + 32MP కెమెరాలు, IP65 రేటింగ్ తో రాబోతున్న Vivo V60 Lite 4G!

ఈ యూనిట్‌లో ఐదుగురు కార్మికులు పనిచేస్తుండగా, వారిలో దీపక్ (38) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్ కోమ (55) వెన్నుపై కాలిన గాయాలతో, దినేశ్ గదగ్ (40) ముఖంపై తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు కార్మికులు లక్ష్మణ్ మండల్ (60), సంతోష్ తారే (51) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పేలుడు ధాటి తీవ్రంగా ఉండటంతో సమీప ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది అని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో, ఈ ప్రమాదం కెమికల్ రియాక్షన్ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలో తగిన భద్రతా ఏర్పాట్లు లేవని, ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Viral: మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన

Exit mobile version