Site icon NTV Telugu

Pakistani woman Seema Haider: భారత్ జెండాకు జేజేలు కొట్టిన పాకిస్తానీ మహిళ…వీడియో వైరల్

Seema

Seema

పాకిస్తానీలు మన దేశాన్ని పొగిడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. పబ్జీ ఆటలో పరిచయమైన సచిన్ అనే యువకుడిని ప్రేమించి తన పిల్లలతో సహా దేశాన్ని విడిచి వచ్చేసిన మహిళ సీమా హైదర్ గుర్తింది కదా. తాజా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీమా పాల్గొన్నారు. నోయిడాలోని తన ప్రియుడి ఇంట్లో పిల్లలతో కలిసి ఈ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీమా భారత జాతీయ పతాకం రంగు చీర ధరించింది. అంతేకాకుండా జాతీయ పతాకం చేతిలో పట్టుకొని భరతమాతకు జేజేలు పలికింది. వారి ఇంటిపై కూడా జాతీయ జెండాను ఎగురవేశారు.

Also Read: Viral News:భర్తకు విషం కలిపిన కాఫీ ఇస్తున్న భార్య… అతను ఏం చేశాడంటే?

సచిన్ ను పెళ్లాడి తాను కూడా భారతీయురాలిగా మారిపోయానని అంటున్న సీమా భరతమాత తనకు కూడా తల్లే అని చెబుతుంది. తనకు భారత పౌరసత్వం జారీ చేయాలంటూ సీమా హైదర్ ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాను పాకిస్తాన్ వెళ్లేది లేదని తెగేసి చెబుతుంది ఈ మహిళ. ఇక పాకిస్తానీ మహిళ భరత మాతకు జేజేలు చెబుతుంటే బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సీమా హైదర్ ప్రేమ ప్రయాణం ఆధారంగా పలు సినిమాలు నిర్మించే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఇక నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ అియతే సీమానే హీరోయిన్ చేయలని కోరగా ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించారు.

Exit mobile version