Site icon NTV Telugu

Pakistan LoC firing: పాకిస్తాన్ వరుసగా ఏడో రోజు కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఎల్‌ఓసి వద్ద కాల్పులు.. తిప్పికొట్టిన భారత సైన్యం

Loc

Loc

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా ఏడో రోజు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతకు కేంద్రంగా ఉండే కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో జరిగాయి. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది.

Also Read:YS.Jagan: నేడు స్థానిక ప్రతినిధులతో జగన్ భేటీ.. అనంతరం బెంగళూరుకు పయనం

ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల మధ్య రాత్రి నౌషేరా, సుందర్‌బానీ, అఖ్నూర్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం ప్రకారం, “ఏప్రిల్ 29-30 రాత్రి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని నౌషేరా, సుందర్‌బానీ, అఖ్నూర్ సెక్టార్లలో ఎల్‌ఓసి వెంబడి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపాయి. భారత ఆర్మీ దళాలు వేగంగా, తగిన విధంగా స్పందించాయి.” అని సైనిక వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ సైన్యం వరుసగా ఏడవ రోజు కూడా ఎల్‌ఓసి వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించడం గమనార్హం.

Also Read:CSK vs PBKS: ప్లేఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం

పహల్గామ్ దాడి తరువాత, భారత్ 65 సంవత్సరాల నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారి భూ సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేయడం, పాకిస్తాన్ సైనిక అటాచ్‌ను బహిష్కరించడం వంటి అనేక శిక్షాత్మక చర్యలను ప్రకటించింది.

Exit mobile version