Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. వేర్వేరు వర్గాలకు చెందిన యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో.. ఒక ఉన్మాద మూక ఏకంగా ఒక గ్రామాన్నే తగలబెట్టింది. ఈ అనాగరిక దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది.
అసలేం జరిగిందంటే..
సింధ్ ప్రావిన్స్‌లోని బురిర్రో తెగకు చెందిన ఒక యువకుడు, చన్నా తెగకు చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ యువతి తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా, వారి అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి చన్నా తెగకు చెందిన పెద్దలకు తీవ్ర అవమానంగా అనిపించింది. దీనిని తమ కుల అహంకారానికి జరిగిన భంగంగా భావించిన వారు.. బురిర్రో తెగపై ప్రతికారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
- TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
గ్రామంపై సాయుధ మూక దాడి..
ఈ క్రమంలో చన్నా తెగకు చెందిన దాదాపు వంద మందికి పైగా సాయుధ పురుషులు ఒక ముఠాగా ఏర్పడి, యువకుడి గ్రామంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. వారి చేతుల్లో తుపాకులు, కర్రలు, పెట్రోల్ బాటిళ్లు ఉన్నాయి. గ్రామంలోకి చొరబడిన ఆ మూక కంటికి కనిపించిన ఇళ్లపై దాడి చేస్తూ.. నిప్పు పెట్టడం ప్రారంభించింది. చూస్తూనే ఉండగానే ఇళ్లు అగ్నిఆహుతై, మొత్తం గ్రామం నిప్పుల కుంపటిలా మారింది.
ఈ ఆకస్మిక దాడితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్థులు, మహిళలు, పిల్లలు చెల్లాచెదురుగా పారిపోయారు. బాధితుల ఆస్తులు, పశువులు, నిత్యావసర వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘాతుకం పాకిస్తాన్లో ఇంకా కొనసాగుతున్న కుల అహంకారానికి, గిరిజన వివాదాల తీవ్రతకు అద్దం పడుతోంది.
తాజావార్తలు
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!