Pakistan China Relations: భారతదేశానికి ప్రధానంగా పాకిస్థాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉందని అనేక సార్లు రుజువు అయ్యింది. ఇదే సమయంలో ఈ రెండు దేశాలు ఒకదానికోకటి నమ్మకమైన మిత్రులుగా మారారు. అది ఎంతలా అంటే పాక్ తన అన్ని అవసరాలకు చైనా వైపే చూసేంతలా మారిపోయింది పరిస్థితి. ఇటీవల పాకిస్థాన్ తన మూడవ హ్యాంగర్-క్లాస్ జలాంతర్గామిని ప్రయోగించింది. కానీ దీనిని పాక్ విజయంగా చెప్పడం కష్టం.. ఎందుకంటే ఈ జలాంతర్గామి పూర్తిగా చైనాలోనే తయారు చేయబడింది. పాకిస్థాన్ తన రక్షణ, అంతరిక్ష, దేశ భద్రత, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పూర్తిగా చైనాపైనే ఆధారపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మెల్లమెల్లగా డ్రాగన్ గుప్పిట్లోకి వెళ్తుందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Rahul Gandhi Bihar Yatra: బీహార్‌లో ఓట్ల దోచుకునేందుకు చూస్తున్నారు: రాహుల్ గాంధీ
81 శాతం ఆయుధాలు అక్కడి నుంచే..
పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో దాదాపు 81 శాతం చైనా నుంచి వచ్చినవే ఉన్నాయి. చైనా పాకిస్థాన్‌కు దాదాపు 8.2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసింది. ఇది పూర్తి వ్యూహాత్మక మార్పు, ఎందుకంటే గతంలో పాక్ పాశ్చాత్య దేశాల నుంచి కూడా ఆయుధాలను కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా చైనా నుంచే ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. ఈ నివేదికలు పాక్ సైనికపరంగా ఎంత ఎక్కువగా చైనాపై ఆధారపడిందో రుజువు చేస్తున్నాయి.
నిఘా సమాచారాన్ని పంచుకుంటున్న రెండు దేశాలు..
ఈ రెండు దేశాల మధ్య కేవలం ఆయుధాల అమ్మకాలు మాత్రమే కాకుండా సంక్లిష్టమైన సాంకేతిక సహకారం, ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పాక్‌కు చైనా యుద్ధ విమానాలు, క్షిపణులు, జలాంతర్గాములు, రాడార్ వ్యవస్థలు సమకూర్చింది. ఈ రెండు దేశాలు రహస్య నిఘా సమాచారాన్ని కూడా మార్పిడి చేసుకుంటున్నాయి. పాక్ దగ్గర ఉన్న పాశ్చాత్య సాంకేతికత సమాచారాన్ని చైనాకు అందిస్తే, డ్రాగన్ దేశం దానిని తన సైనిక అభివృద్ధిలో ఉపయోగిస్తుంది.
భారత్ వివాదంలో చైనా ఆయుధాల వినియోగం..
మే 2025 నాటి భారతదేశం-పాక్ వివాదంలో చైనా సాంకేతిక పాక్‌కు ఎంత వరకు కలిసి వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్థాన్ చైనా సంయుక్తంగా తయారు చేసిన J-10C యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను దాయాది దేశం ఉపయోగించింది. ఈ ఆయుధాలు పాక్ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచాయి. ఇప్పుడు పాకిస్థాన్ చైనా నుంచి మరిన్ని అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయడానికి కూడా సిద్దమతున్నట్లు సమాచారం. పాక్ చైనాపై ఆధారపడటం కేవలం సైనిక రంగానికే పరిమితం కాలేదు. దాయాది అంతరిక్ష కార్యక్రమంలో కూడా చైనా నీడ స్పష్టంగా కనిపిస్తుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా సహాయంతో ప్రయోగించడం పాక్ అంతరిక్ష సాంకేతికతపై చైనా పట్టును చూపిస్తుంది.
పాక్ భద్రత, అంతరిక్షం, రక్షణ సాంకేతికత పూర్తిగా చైనా నియంత్రణలోకి మెల్లమెల్లగా మారుతున్నాయి. జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, అంతరిక్ష ఉపగ్రహాల తయారిలో పాక్ స్వదేశీ సాంకేతిక పూర్తిగా ముగిసింది. చైనా సైనిక, సాంకేతిక ఆధిపత్యం దాయాదికి అనివార్యమైన మద్దతుగా మారింది. నిజానికి ఇప్పుడు చైనా లేకుండా పాక్ తన భద్రతను జాగ్రత్తగా చూసుకోలేదనే స్థితికి దిగజారిపోయింది. ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు భారత్ నిశితంగా గమనిస్తుంది.
READ MORE: Rajini Kanth : పవన్ కల్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్
