Pakistan Tomato Prices: ఈ రోజుల్లో చేసిన పాపానికి దేవుడి నుంచి తప్పించుకున్న కర్మ నుంచి కచ్చితంగా తప్పించుకోలేరని చెబుతున్నారు పెద్దలు. ఇది ఎందుకు అంటే.. ఈ విషయం దాయాది దేశంలో వాస్తవంగా కనిపిస్తుంది. చేసిన పాపాలకు పాకిస్థిన్‌కు పాముల చుట్టుముట్టి విషం చిమ్ముతున్నాయి. ఎంతలా ఉగ్రవాదాన్ని ప్రపంచంపైకి ఎగదోసి వినాశనాకి కారణం అయ్యిందో ఇప్పుడు అంతలా ఈ దేశం అవస్థలు పడుతుంది.. దాయాది దేశంలో టమాటాలు మండిపోతున్నాయి.. కిలో టమాట ధర పాకిస్థాన్‌లో రూ.600 – 700 మధ్య ఉంది.
READ ALSO: Neeraj Chopra: గోల్డెన్ బాయ్‌కు అరుదైన గౌరవం.. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా..!
టమాటాలకు రెక్కలు..
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇప్పటికే అనేక అవస్థలతో సతమతమౌతున్న దాయాది దేశానికి కొత్తగా ప్రకృతి విపత్తులు తోడయ్యాయి. దీంతో పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మీరు ఊహించరు కానీ ఈ దేశంలో ప్రస్తుతం కిలో టమాటా ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీతో సహా చాలా నగరాల్లో కిలో టమాటా రూ.700కి అమ్ముడవుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యపోకండీ ఈ దారుణానికి పాకిస్థాన్ తన చేజేతులా చేసిన పాపాలే కారణం అంటున్నారు.. విశ్లేషకులు.
పాకిస్థాన్ సామా టీవీ నివేదికల ప్రకారం… దేశంలోని చాలా ప్రాంతాల్లో వచ్చిన వరదలు పంటలను నాశనం చేశాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కు వచ్చే టమాటా సరఫరా నిలిచిపోయింది. ఒకే సమయంలో ప్రకృతి విపత్తు, ఆఫ్ఘన్‌తో ఘర్షణ కారణంగా దేశీయ మార్కెట్లో టమాటాల ధర అమాంతం పెరిగిపోయిందని వెల్లడించింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆఫ్ఘన్ దేశం నుంచి వచ్చే టమాటాలపై పాకిస్థానే నిషేధం విధించింది. ఈ నిర్ణయం దెబ్బకు దేశంలో టమాటాలకు రెక్కలు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే పాకిస్థాన్‌లో కొన్ని వారాల క్రితం వరకు కిలో టమాటా ధర రూ.100 ఉండేది. కానీ ఇప్పుడు పాక్ మార్కెట్లో టమాటాల పేరు ఎత్తితే జనాలు జంకుతున్నారు. దేశంలో ఒకేసారి భారీగా ధరలు రావడం, ఆఫ్ఘన్ నుంచి వచ్చే టమాటలపై నిషేధం విడించడం వంటి నిర్ణయాలు దేశీయంగా టమాటాలకు భారీగా ధర పెరగడానికి ప్రత్యక్ష కారణాలు పాకిస్థాన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దాయాది దేశంలోని ఫైసలాబాద్‌లో కిలో టమాటా ధర ఒకేసారి రూ.160 నుంచి రూ.500కి పెరిగింది. ఇదే సమయంలో ముల్తాన్‌లో కిలో టమాటా రూ.450కి అమ్ముడవుతోంది. లాహోర్‌లో కిలోకు రూ.400 పలుకుతుంది. అలాగే పంజాబ్‌లోని జీలంలో కిలో టమాటా ధర రూ.700కి చేరింది. గుజ్రాన్‌వాలాలో కిలోకు రూ.575 పలుకుతుంది. వాస్తవానికి దేశంలో ప్రభుత్వ అధికారిక ధరల జాబితా ప్రకారం కిలోకు గరిష్ట ధర రూ.170గా నిర్ణయించారు. కానీ ఈ ధర ఎక్కడా అమలు కావడం లేదని పాకిస్థానీ ప్రజలు చెబుతున్నారు.
READ ALSO: Bihar Election 2025: ఓటింగ్‌కి ముందే ఓటమి – బీహార్ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేసిన ముగ్గురు!
