Number of madrasas in Pakistan: పాకిస్థాన్‌లో ఫ్యాక్టరీల కంటే మసీదులు, మదర్సాలే ఎక్కువగా ఉన్నాయని తాజాగా చేసిన ఆ దేశ ఆర్థిక జనాభా లెక్కల నివేదిక గణాంకాలు వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం.. దేశంలో మసీదులు, మదర్సాల సంఖ్య పరిశ్రమల కంటే చాలా ఎక్కువగా ఉందని బహిర్గతం చేశాయి. తాజా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్‌లో 6 లక్షలకు పైగా మసీదులు, 36 వేలకు పైగా మదర్సాలు ఉన్నాయని వెల్లడైంది. అయితే దాయాదీ దేశంలో కర్మాగారాల సంఖ్య కేవలం 23 వేలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. నగదు కొరతను ఎదుర్కొంటున్న పాక్.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో US $7 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీ రెండవ సమీక్షపై చర్చలు జరుపుతున్న సమయంలో ఈ నివేదికలు వెలువడ్డాయి.
READ ALSO: UP: ఛీ.. ఛీ.. రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. ప్రేమ జంట వికృత చేష్టలు..(వీడియో)
సేవా రంగమే అతిపెద్ద ఉపాధి మార్గం..
తాజా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లోని మొత్తం 40 మిలియన్ల శాశ్వత యూనిట్లలో 7.2 మిలియన్ల ఉపాధి నిర్మాణాలు నమోదు చేయబడ్డాయి. 2023 నాటికి వీటిల్లో 25.4 మిలియన్ల మంది పనిచేస్తున్నారు. పాక్ ప్రజలకు ఉపాధి కల్పించడంలో సేవా రంగం అతిపెద్ద వాటా కలిగి ఉంది. దీనిలో 45% మంది ప్రజలు అంటే 11.3 మిలియన్ల మంది పనిచేస్తున్నారు. దీని తరువాత 30% అంటే 7.6 మిలియన్ల మంది సామాజిక రంగంలో, 22% మంది ఉత్పత్తి రంగంలో ఉపాధి పొందుతున్నారు. దేశంలో పరిశ్రమలు ప్రధాన ఉద్యోగాలను సృష్టించే రంగం అనే అపోహను ఈ గణాంకాలు చెరిపేశాయని ఓ పాక్ అధికారి తెలిపారు.
ఎక్కువ భాగం ప్రభుత్వ నిర్వహణలోనే..
తాజా నివేదికలో పాకిస్థాన్‌లో మొత్తం 7.2 మిలియన్ల నమోదిత సంస్థలలో 2.7 మిలియన్లు రిటైల్ దుకాణాలు, 1.88 లక్షల హెూల్ సేల్ దుకాణాలు, 2.56 లక్షల హెూటళ్లు, 1.19 లక్షల ఆస్పత్రులు ఉన్నాయని పేర్కొంది. విద్యా రంగంలో 2.42 లక్షల పాఠశాలలు, 11,568 కాలేజీలు, 214 విశ్వవిద్యాలయాలు, 6.04 లక్షల మసీదులు, 36,331 మదర్సాలు నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉండగా, కాలేజీల్లో ప్రైవేట్ రంగం కొంచెం ఎక్కువ వాటాను కలిగి ఉంది.
పంజాబ్లో అత్యధికంగా 58% సంస్థలు ఉన్నాయి. ఆ తర్వాత సింధ్ (20%), ఖైబర్ పఖుంఖ్వా (15%), బలూచిస్థాన్ (6%)లో ఉన్నాయి. ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతంలో కేవలం 1% వాటాతో అత్యల్పంగా ఉంది. తాజా నివేదిక ప్రకారం.. పాక్‌లో చాలా వ్యాపారాలు చిన్న తరహావని వెల్లడైంది. దాదాపు 7.1 మిలియన్ ఆర్థిక నిర్మాణాలు 1 నుంచి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 51 నుంచి 250 మంది ఉద్యోగులతో 35,351 సంస్థలు మాత్రమే ఉన్నాయి. 250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో 7,086 యూనిట్లు మాత్రమే పని చేస్తున్నాయి. ఈ నివేదికపై పాక్ ప్రణాళిక మంత్రి అహ్సాన్ ఇక్బాల్ మాట్లాడుతూ.. “విశ్వసనీయమైన డేటా స్థిరమైన అభివృద్ధికి వెన్నెముక వంటిది. ఎందుకంటే ఇది ప్రణాళికలతో, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతాయి” అని అన్నారు.
READ ALSO: Billionaire Bunkers: బిలియనీర్లకు ప్రాణభయం.. రిసార్ట్‌లను తలదన్నేలా బంకర్ల నిర్మాణం..
