Pakistan : గత కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభంతో కూరుకున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాజధాని ఇస్లామాబాద్‌లో అబ్దుల్ కారు మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ శనివారం మారియోట్ నుంచి సెక్రటేరియట్ చౌక్ వైపు వెళుతుండగా ఆయన కారును హిలక్స్ రెవో ఢీ కొట్టిందని ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. షాకూరును హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also : Rangareddy Crime: షాద్ నగర్ లో కిడ్నాప్.. గచ్చిబౌలిలో హత్య
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్బర్ నాసిర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి షాకూర్ తన కారును ఒంటరిగా నడుపుతున్న సమయంలో మరో వాహనాన్ని ఢీకొట్టిందని చెప్పారు. ఆయన తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఇక, ఈ రోడ్డు ప్రమాద ఘటనపై అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సమగ్ర దర్యాప్తునకు రాణా సనావుల్లా ఆదేశించారు. షాకూర్ మృతిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. షాకూర్ సైద్ధాంతిక రాజకీయ నాయకుడని కొనియాడారు. మంచి మనిషిగా సమాజానికి సేవలు చేశారని ప్రశంసించారు. పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ కూడా మంత్రి షాకూర్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
