Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్ లో పరువు హత్యలు.. ఇద్దరి కూతుళ్లను చంపేసిన తండ్రి

Pak Man

Pak Man

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. ఓ తండ్రి పరువు కోసం తన ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపి పారిపోయిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. పాక్ దేశం పంజాబ్ రాష్ట్రంలోని కసూర్ జిల్లా హవేలీ నథోవాలి గ్రామానికి చెందిన సయీద్ అనే తండ్రి తన ఇద్దరు కుమార్తెలపై గన్ తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూతుళ్లు చనిపోయారు.

Read Also: Malli Pelli : ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపి వేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో..

అనంతరం తండ్రి నేర స్థలం నుంచి పారిపోయాడు. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. పారిపోయిన తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పన్నెండేళ్ల బాలుడు పరువు కోసం గుజ్రాన్ వాలా శాటిలైట్ టౌన్ లో తల్లిని చంపిన ఘటన ఈ వారంలోనే జరిగింది. తల్లి వీధిలో నడిచి వెళుతుండగా 12 ఏళ్ల కొడుకు ఆమెను కాల్చిచంపాడు. పాకిస్థాన్ లో తరచూ పరువు హత్యలు జరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, బాలుడు హత్యను అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: IDFC : హెచ్‎డీఎఫ్‎సీ మార్గంలోనే ఐడీఎఫ్‎సీ.. ఈ గ్రూప్ కంపెనీలు తర్వలో విలీనం

Exit mobile version