Site icon NTV Telugu

Pakistan: లష్కరే తోయిబాకు పాక్ నిధులు.. దాయాది బుద్ధి మారదు..

Pakistan Funding

Pakistan Funding

Pakistan: ఆపరేషన్ సింధూర్‌తో పాక్ పీచమనిచినా దాయాది బుద్ధి మాత్రం మారడం లేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో వైమానిక దళం లష్కరే తోయిబా (LET) ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబాపై బాంబులతో విరుచుకుపడింది. ఈ ఉగ్రకేంద్రం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో ఉంది. భారత్ దాడిలో లష్కరే కమాండ్ సెంటర్, కేడర్ వసతి, ఆయుధాల నిల్వ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన ఉమ్-ఉల్-ఖురా బ్లాక్‌‌లు ఖతం అయ్యాయి.

READ ALSO: Weather Update : ఏపీ, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

ఇంత జరిగినా పాక్ బుద్ధి మాత్రం మారలేదు. తమ దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయించే దాయాది దేశం తాజాగా భారత్ దాడిలో శిథిలమైన లష్కరే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి నిధులు సమకూరుస్తోందని నిఘా నివేదికలు వెల్లడించాయి. ఇస్లామాబాద్ ఇప్పటికే లష్కరేకు 4 కోట్ల పాకిస్థానీ రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్మాణం పూర్తి కావడానికి రూ.15 కోట్లు పడుతుందని అంచనా. ఈ పనులను లష్కరే అగ్ర కమాండర్లు మౌలానా అబూ జార్, యూనస్ షా బుఖారీ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 5, 2026 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తుంది.

వరద సహాయం పేరుతో విరాళాల సేకరణ..
లష్కరే ఉగ్రవాదులు పాక్‌లో సంభవించిన భారీ వరదల పేరుతో విరాళాలు సేకరించడం ప్రారంభించారు. ఇక్కడ నిజం ఏమిటంటే ఈ డబ్బులను ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. అంతకుముందు 2005లో భూకంపం సమయంలో జమాత్-ఉద్-దవా కూడా ఇదే విధంగా సహాయం పేరుతో డబ్బును సేకరించింది. ఈ డబ్బులో 80% ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి ఉపయోగించనట్లు సమాచారం. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదంపై పోరాటం గురించి పాకిస్థాన్ పదే పదే మాట్లాడుతుంది. కానీ వాస్తవంలోకి వస్తే దాయాది దానికి విరుద్ధంగా నడుచుకుంటుంది. పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ లష్కరేను పునరుద్ధరించడానికి సహాయం చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం. ఇది పాకిస్థాన్ ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉగ్రవాద శిక్షణకు ప్రధాన కేంద్రం..
లష్కర్ ప్రధాన శిక్షణా కేంద్రం మర్కజ్ తైబా. ఇక్కడ ఉగ్రవాదులకు మౌలికవాదం, ఆయుధ నిర్వహణ, నిఘా కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చేవారు. ప్రతి ఏడాది సుమారు 1000 మంది ఉగ్రవాదులకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారని నిఘా నివేదికలు చెబుతున్నాయి. 26/11 ముంబై దాడి ఉగ్రవాది అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన ప్రదేశం ఇదే. 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవూర్ హుస్సేన్ రాణా, జాకి-ఉర్-రెహ్మాన్ లఖ్వీ సూచనల మేరకు అబ్దుల్ రెహ్మాన్ సయీద్ అలియాస్ పాషా, హరూన్, ఖుర్రామ్‌లతో కలిసి మురిద్కేకు వచ్చారని సమాచారం. మర్కజ్ తైబాలో మసీదు, అతిథి గృహం నిర్మాణం కోసం ఒసామా బిన్ లాడెన్ రూ.1 కోటి విరాళంగా ఇచ్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

READ ALSO: Alluri Seetharamaraju district : అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి రవాణా పోలీసులు పట్టివేత

Exit mobile version