Site icon NTV Telugu

Pakistan: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్! దేశం విడిచి పారిపోతున్న వైద్యులు, ఇంజనీర్లు

Pakistan

Pakistan

Pakistan: పాకిస్థాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద ప్రతిభా వలస (టాలెంట్ ఎగ్జోడస్)ను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కేవలం రెండేళ్లలోనే వేల సంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ప్రభుత్వ నివేదిక ఈ నిజాన్ని బయటపెట్టింది. గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది.

READ MORE: CP Sajjanar: హైదరాబాద్ లో 15% తగ్గిన నేరాల సంఖ్య..

ఈ పరిస్థితి కారణంగా పాకిస్థానీయులు ప్రభుత్వాన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆయన ఈ భారీ వలసను “బ్రెయిన్ డ్రెయిన్ కాదు, బ్రెయిన్ గైన్” అని పాజిటివ్‌గా చూపించడానికి ప్రయత్నించారు. కానీ గణాంకాలు ఆయన మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ నివేదికను మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ ప్రస్తావించారు. “రాజకీయాలను సరిదిద్దితేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. పాకిస్థాన్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్. కానీ ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల వల్ల 1.62 బిలియన్ డాలర్ల నష్టం జరిగి, 23.7 లక్షల ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

READ MORE: Naga Babu: అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది.. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!

పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన తాజా డేటా ఈ దారుణ పరిస్థితి గురించి వెల్లడించింది. 2024లో పాకిస్థాన్‌కి చెందిన 7,27,381 మంది విదేశీ ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, ఈ ఏడాది నవంబర్ వరకే 6,87,246 మంది నమోదు చేసుకున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. గతంలో గల్ఫ్ దేశాలకు కూలీ పనుల కోసం వెళ్లేవారు. ఇప్పుడు చదువుకున్న, నైపుణ్యం ఉన్న వృత్తి నిపుణులు కూడా పెద్ద సంఖ్యలో దేశం విడిచిపెడుతున్నారు.

నివేదిక ప్రకారం.. డాక్టర్లు దేశాన్ని విడవటం మరింత ఆందోళన కలిగించింది. ఆరోగ్య రంగం అత్యంతగా దెబ్బతింది. 2011 నుంచి 2024 మధ్య కాలంలో నర్సుల వలస 2,144 శాతం పెరిగింది. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగిందని పాకిస్థాన్ ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదిక తెలిపింది. వైట్ కాలర్ ఉద్యోగులు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో వెళ్లిపోవడంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విమానాశ్రయాల్లో నియంత్రణలను కఠినతరం చేసింది. 2025లోనే 66,154 మంది ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే నిలిపివేశారు.

Exit mobile version