Pakistan Balochistan attack: పాకిస్తాన్‌కు భారీ షాక్.. 80 మందికి పైగా భద్రతా సిబ్బంది మృతి, 18 మంది బంధీలుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Balochistan Attack: పాకిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన భారీ దాడుల్లో 80 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం, పోలీస్, గూఢచారి సంస్థలు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లకు చెందిన సిబ్బంది మృతి చెందినట్లు BLA ప్రకటించింది. ఈ దాడులను “ఆపరేషన్ హీరోఫ్ ఫేజ్–2”గా పేర్కొంటూ BLA ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Budget 2026 Expectations: బడ్జెట్‌పై నిరుద్యోగుల ఆశలు.. రైతుల గోస.. సామాన్యుడి ఆకలి తీరేనా?
Also Read
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
BLA ప్రకటన ప్రకారం దాదాపు పది గంటల పాటు కొనసాగిన దాడులు బలూచిస్తాన్‌లోని అనేక జిల్లాల్లో ఒకేసారి జరిగాయి. భద్రతా దళాలు, సైనిక స్థావరాలు, పరిపాలనా కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి. విడుదలైన ప్రకటనలో.. క్వెట్టా, నోష్కీ, మస్తుంగ్, దల్బందిన్, కలాత్, ఖరాన్, పంజ్గూర్, గ్వాదర్, పస్ని, తుర్బత్, తుంప్, బులెడా, మాంగోచర్, లస్బేలా, కెచ్, అవరాన్ తదితర ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిగాయని పేర్కొంది. శత్రు సైనిక, పరిపాలనా, భద్రతా వ్యవస్థలపై” దాడులు చేసి, పలు ప్రాంతాల్లో భద్రతా దళాల కదలికలను తాత్కాలికంగా నిలిపివేశామని BLA వెల్లడించింది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 84 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని, మరో 18 మందిని బంధీలుగా పట్టుకున్నామని BLA తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వానికి చెందిన 30కిపైగా కార్యాలయాలు, బ్యాంకులు, జైళ్లు ధ్వంసమయ్యాయని, 20కుపైగా వాహనాలకు నిప్పంటించామని పేర్కొంది. ఈ ఎదురుకాల్పుల్లో కొన్ని భద్రతా స్థావరాలపై తాత్కాలికంగా నియంత్రణ సాధించినట్లు కూడా వాదించింది.
Jowar Biscuit Recipe: ఇంట్లోనే క్రంచీ క్రంచీ జొన్న పిండి రుచికరమైన బిస్కెట్స్ ఇలా చేసేయండి!
వీటితోపాటు ఈ దాడుల్లో తమవైపు ఏడుగురు యోధులు మృతి చెందినట్లు BLA అంగీకరించింది. వీరిలో తమ “ఎలైట్ మజీద్ బ్రిగేడ్” సభ్యులు కూడా ఉన్నారని తెలిపింది. భద్రతా స్థావరాలపై సమన్వయ దాడుల్లో వీరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్‌లో పనిచేస్తున్న అనేక వేర్పాటువాద మిలిటెంట్ సంస్థలలో ఒకటి. రాజకీయ స్వయంప్రతిపత్తి, సహజ వనరుల నియంత్రణ, అభివృద్ధిలో నిర్లక్ష్యం వంటి కారణాలతో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో తిరుగుబాటు కొనసాగుతోంది. ముఖ్యంగా చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)కు సంబంధించిన ప్రాజెక్టులు, విదేశీ ప్రయోజనాలపై BLA గతంలోనూ దాడులకు పాల్పడింది.
Baloch Rebel Group Balochistan Liberation Army seen taking control of the market in Quetta. Pakistan Army soldiers helpless under Asim Munir. pic.twitter.com/34K0jISb0X
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 31, 2026
తాజావార్తలు
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!