Pakistan: పెద్దలు ఎప్పుడో చెప్పారు.. నువ్వు ఏం చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని.. అచ్చం పాక్‌స్థాన్‌కు ఇప్పుడు అలాగే జరుగుతుంది. పాక్ పాలుపోసి పెంచిన ఉగ్రవాదాన్ని ప్రపంచం మీదకు ఉసిగొట్టిన పాపం ఇప్పుడు ఆ దేశాన్నే పట్టిపీడిస్తుంది. తాజాగా పాకిస్థాన్‌లో ఆ దేశ ఆర్మీ టార్గెట్‌గా ఐఈడీ బాంబు పేలుడు జరిగింది. ఈ దాడిలో స్పాట్‌లోనే ఐదుగురు పాక్ ఆర్మీ అధికారులు మరణించినట్లు సమాచారం.
ఎక్కడ జరిగింది అంటే..
బలూచిస్థాన్‌లోని మాండ్లోలో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు టార్గెట్‌గా ఐఈడీ పేలుడు సంభవించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో పాక్ సైన్యానికి చెందిన 5 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. మాండ్లోని షాండ్ ప్రాంతంలో పాక్ ఆర్మీ ప్రయాణిస్తున్న ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ వకార్ కాకర్, నాయక్ జునైద్, నాయక్ ఇస్మత్, లాన్స్ నాయక్ ఖాన్ ముహమ్మద్, సిపాయి జహూర్ మరణించారని అధికారులు పేర్కొన్నారు. పేలుడు తర్వాత ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అప్పుడు 12 మంది మరణించారు…
బలూచిస్థాన్‌లో మే నెలలో పాక్ సైనిక వాహనంపై జరిగిన ఐఈడీ బాంబు దాడిలో 12 మంది సైనికులు మరణించారు. బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ పేలుడులో స్పెషల్ ఆపరేషన్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూఖ్ సహా 12 మంది సైనికులు మరణించారు.
READ ALSO: Hybrid RPA Drones: భారత్ కొత్త నిఘా నేత్రం.. ఇక శత్రుదేశాలకు నిద్రపట్టదు
