Cylinder Explosion: పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఇద్దరు మృతి, పలువురు గాయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cylinder Explosion: రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వినిపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Israeli Airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. చిన్నారులు సహా 30 మంది మృతి!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అందిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 7.50 గంటల సమయంలో ఓ ఆక్సిజన్ బాటిలింగ్ ప్లాంట్ లో పేలుడు జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అక్కడ ఇద్దరు తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో వ్యక్తి ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కరణీ విహార్ కాలనీ రోడ్ నంబర్–17లో ఉన్న సూపర్ గ్యాస్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంతేకాకుండా పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. విస్ఫోటనం తర్వాత ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగి చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే విశ్వకర్మ పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక దళాలు, సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. స్థానికుల సహాయంతో ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చారు.
Budget 2026 Expectations: ఇది సంచలనాల పద్దు కాదు.. సమతుల్య బడ్జెట్! పన్ను మార్పులపై ఆశలు శూన్యమే?
అగ్నిమాపక శాఖ సంబంధించిన పలు వాహనాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఘటన ప్రాంతాన్ని పూర్తిగా కార్డన్ చేసి, స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ పేలుడుకు గల కారణాలపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఘటన తీవ్రతను పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, జిల్లా అధికారులు తెలిపారు.
#WATCH | Jaipur, Rajasthan | An oxygen cylinder blast in a factory kills two and injures one.
Ravindra Naruka, SHO, Vishwakarma Police Station, says, "We received information of a blast around 7:50 pm at an oxygen bottling plant. We immediately arrived at the scene and found… pic.twitter.com/Arpo1q20xl
— ANI (@ANI) January 31, 2026
VIDEO | Jaipur, Rajasthan: Oxygen cylinder explosion in Jaipur industrial area kills two, injures one. More details awaited.
(Source: Third Party)#Rajasthan #Jaipur pic.twitter.com/YbpqcWTIDL
— Press Trust of India (@PTI_News) February 1, 2026
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!