Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్రమైన ఎండలు, అంధకారం కలిసి ఒక పౌల్ట్రీ ఫామ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దురదృష్టకర సంఘటనలో.. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 5,300 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ఈ ఘోరానికి ప్రధాన కారణంగా మారింది.
హీట్ ఛాంబర్‌గా మారిన పౌల్ట్రీ షెడ్..
బాధిత పౌల్ట్రీ ఫామ్ యజమాని టుటు పాఢి తెలిపిన వివరాల ప్రకారం.. అది అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఎన్విరాన్మెంట్-కంట్రోల్డ్ (EC) పౌల్ట్రీ ఫామ్. ఈ మూసి ఉన్న (ఎన్క్లోజ్డ్) షెడ్లలో ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి కూలింగ్ ఫ్యాన్లు, వెంటిలేషన్ సిస్టమ్స్ నిరంతరం నడవాల్సి ఉంటుంది. అయితే.. ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ హఠాత్తుగా చెడిపోవడంతో కరెంట్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కూలింగ్ సిస్టమ్స్ ఆగిపోయి, మూసి ఉన్న ఆ షెడ్లు కాసేపట్లోనే ఒక వేడి కొలిమిలాగా మారిపోయాయి. విపరీతమైన వేడిని తట్టుకోలేక లోపల ఉన్న వేలాది కోళ్లు శ్వాస ఆడక, తీవ్రమైన ఎండ దెబ్బకు గురై గంటల వ్యవధిలోనే కుప్పకూలాయి.
Also Read
- 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
- CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
- CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
డీజిల్ దొరక్క పెరిగిన నష్టం..
విద్యుత్ పోయిన వెంటనే యజమాని పాఢి ప్రత్యామ్నాయంగా తన వద్ద ఉన్న డీజిల్ జనరేటర్‌ను రన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. దురదృష్టవశాత్తూ జనరేటర్‌కు సరిపడా డీజిల్ అందుబాటులో లేదు. స్థానిక ఇంధన స్టేషన్లలో డీజిల్ కొరత ఉండటం, అత్యవసర పరిస్థితి అని మొరపెట్టుకున్నప్పటికీ బారెల్స్‌లో డీజిల్ ఇచ్చేందుకు వారు నిరాకరించడంతో జనరేటర్ ప్రారంభించలేకపోయాడు. మల్కన్‌గిరిలోని విపరీతమైన ఎండలకు ఆ జనరేటర్ గంట నడవాలన్నా దాదాపు 7 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది.
చివరకు విద్యుత్ పునరుద్ధరణ జరిగే సమయానికే దాదాపు 12 నుంచి 12.5 టన్నుల బరువున్న 5,300 కోళ్లు చనిపోయాయి. డీజిల్ సకాలంలో దొరకకపోవడం వల్లే తనకు సుమారు రూ. 15 లక్షల వరకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఘటనపై పరిహారం లేదా డీజిల్ కొరత ఆరోపణలపై స్థానిక అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
-
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
-
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!