NTV Telugu Site icon

NEET: నీట్ రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టుకు ర్యాంకర్ల వినతి

Cirur

Cirur

నీట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంతో అట్టుడుకుతోంది. పరీక్ష రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను రద్దు చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. నీట్‌ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్‌టీఏను ఆదేశించాలని కోరుతూ 56 మంది నీట్‌ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా 56 మంది నీట్‌ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీట్‌ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్‌టీఏను ఆదేశించాలని కోరారు. నీట్‌ వ్యవహారంపై ఇప్పటివరకు 26 పిటిషన్లు దాఖలు కాగా.. వీటన్నింటినీ జులై 8న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.