NTV Telugu Site icon

Dudhsagar Falls : దూద్‌సాగర్‌ జలపాతం వద్ద కూలిన వంతెన.. తప్పిన పెనుప్రమాదం

Dudhsagar Falls

Dudhsagar Falls

Dudhsagar Falls : తీర రాష్ట్రమైన గోవాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోవా-కర్ణాటక సరిహద్దులోని పర్యాటక ప్రాంతమైన దూద్‌సాగర్‌ జలపాతం వద్ద పెనుప్రమాదం తప్పింది. ఈ జలపాతం వద్ద ఉన్న తీగల వంతెన కూలిపోయింది. శుక్రవారం భారీ వర్షం కారణంగా కేబుల్ వంతెన కూలిపోవడంతో దక్షిణ గోవాలోని దూద్‌సాగర్ జలపాతం నుండి 40 మందికి పైగా పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. శుక్రవారం సాయంత్రం గోవా-కర్ణాటక సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ఉద్ధృతి పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోజంతా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

నీటి ఉద్ధృతికి ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఉన్న చిన్నపాటి కేబుల్‌ బ్రిడ్జ్ కూలగా.. కొంతభాగం వరదలో కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 40 మంది పర్యాటకులు నదిని దాటలేక అక్కడే చిక్కుకుపోయారు. ఇది గమనించిన ‘దృష్టి లైఫ్‌సేవర్స్’ బృందం వారిని కాపాడింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ గురించి తెలుసుకున్న గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సహాయక సిబ్బందిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

World Green City: హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్‌ సిటీ అవార్డు.. భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక నగరం

భారీ వర్షాలు, పెరుగుతున్న నీటిమట్టాల కారణంగా రానున్న కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్‌ జలపాతం వద్దకు ఎవరూ వెళ్లవద్దని ‘దృష్టి మెరైన్‌’ ప్రజలను అప్రమత్తం చేసింది. భూతల స్వర్గంగా పిలిచే దూద్‌సాగర్‌ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వర్షాకాలంలో ఈ జలపాతాన్ని సందర్శించడానికి ఎవరినీ అనుమతించరు. కానీ వర్షాలు తగ్గిపోవడంతో ఇటీవల పర్యాటకులను అనుమతిస్తున్నారు.

Show comments