Site icon NTV Telugu

OTT: హ్యాప్పీ వీకెండ్.. ఓటీటీలో 30కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు.. మీ ఛాయిస్ ఏది?

Ott

Ott

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఇంకా ముగియలేదు. ఇంతలో వీకెండ్ వచ్చేసింది. ఈ పండుగకు చాలా మంది ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తారు. కొందరు మాత్రం పలు కారణాల వల్ల ఇంట్లోనే ఉంటారు. అయినా.. ఏం పర్వాలేదు. ఎందుకంటే.. మనల్ని అలరించడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధంగా ఉన్నాయి కదా.. ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు కలిపి మొత్తం 30కి పైగా అందుబాటులో ఉన్నాయి. మీకు ఇష్టమైన సినిమాలను చూడొచ్చు. ప్లాట్‌ఫామ్‌ల వారీగా సినిమాల లిస్ట్‌ను ఇప్పుడు చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

1. నీరజ్ పాండే రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “టాస్కరీ: ద స్మగ్లర్స్ వెబ్ సిరీస్‌” స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది.
2. మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా “ద రిప్” (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది.
3. అగాథా క్రిస్టీ నవల ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ సిరీస్: సెవెన్ డయల్స్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
4. కిల్లర్ వేల్ (Killer Whale) – సర్వైవల్ హారర్ చిత్రం.
5. కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్? – కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా (తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది).
6. వన్ లాస్ట్ అడ్వెంచర్ (One Last Adventure) – ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ మేకింగ్ డాక్యుమెంటరీ.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)

దండోరా – (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
2. 120 బహదూర్ – (హిందీ) – 1962 యుద్ధం నేపథ్యంలో సాగే ఆర్మీ యాక్షన్ డ్రామా.
3. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి – (కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం)
4. ఆర్టిస్ట్ – ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.

జీ5 (ZEE5)

గుర్రం పాపిరెడ్డి – (తెలుగు) – ఫరియా అబ్దుల్లా, నరేష్ అగస్త్య నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్.
2. భా భా బా – (మలయాళం) – దిలీప్ హీరోగా, మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ.
3. సఫియా సఫ్దర్ – (హిందీ) – సోషల్ డ్రామా మూవీ.

జియో హాట్‌స్టార్ (JioHotstar)

అనంత – (తెలుగు, తమిళం, హిందీ) – పుట్టపర్తి సాయిబాబా మహిమల నేపథ్యంలో సురేష్ కృష్ణ తెరకెక్కించిన భక్తిరస చిత్రం.
2. పొనీస్ – స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.
3. డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే – పీరియడ్ డ్రామా.

ఇతర ప్లాట్‌ఫామ్స్

అహా: రిప్పన్ స్వామి (తెలుగు), మహాసేన (తమిళం – అహా తమిళ్).
2. లయన్స్ గేట్ ప్లే: షెల్ (తెలుగు డబ్బింగ్), బందూక్ (కన్నడ).
3. సోనీ లివ్ : కళంకావల్ (మలయాళం, తెలుగు, హిందీ).
4. సన్ నెక్స్ట్ (SunNxt): కిర్క్కన్ (మలయాళం).

 

Exit mobile version