NTV Telugu Site icon

Gangs Of Goadavari : విశ్వక్ మూవీకి భారీ ధరకు ఓటీటీ డీల్..?

Gangs Viswak

Gangs Viswak

టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీతో రాబోతున్నాడు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు.. పక్కా విలేజ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ చెబుతున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి..

ఇక ఈ సినిమా ఒక మాస్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్ లో రూపొందగా, మే17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా అదిరిపోయే ధరకు ఓటీటీ డీల్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూ.14 కోట్లు వెచ్చించి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది..

ఈ సినిమాలో విశ్వక్ పక్కా విలేజ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ప్రేమలో పడటం ఆ తర్వాత పెళ్లి జరగడం అనేవి ఆసక్తిగా ఉన్నాయి.. ఇక ఈ సినిమాలో వేశ్యగా అంజలి కనిపించబోతున్నట్లు సమాచారం. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పాటలు హైలెట్ గా ఉంటాయాని ఇప్పటివరకు విడుదలైన పాటలను చూస్తే అర్థం అవుతుంది.. మరి సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి..

Show comments