NTV Telugu Site icon

Oscars 2024: ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన RRR సినిమా..

Oscar (2)

Oscar (2)

సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 96 వ ఆస్కార్ అవార్డు వేడుక ఫంక్షన్ అట్టహాసంగా మొదలైంది.. నేడు ఘనంగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. గత ఏడాది జరిగిన అవార్డు వేడుక బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా ఆ అవార్డులకు తెలుగు సినిమా అవార్డును గెలుచుకోవడంతో ఆ వేడుకలు ఆసక్తిగా మారాయి.. ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డులు దక్కాయి..

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ట్రిపుల్ సినిమా ప్రపంచమంతా ప్రశంశలు పొంది, ప్రపంచంలోని పలు అత్యున్నత సినీ అవార్డులు గెలుచుకొని ఆస్కార్ వరకు వెళ్ళింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో మొదటి ఇండియన్ సినిమాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచి యావత్ సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది.. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు అందుకొని మన సినీ ఖ్యాతిని అందుకొని సత్తాను చాటారు..

ఈ అవార్డు తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా పేరు సంపాదించడమే కాదు.. విదేశాల్లో కూడా అభిమానుల మనసును చూరగోన్నారు..ఆ సినిమా ఇచ్చిన హైప్ ఆస్కార్ వేదిక ఇంకా మరువలేదు. దీంతో ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా లేకపోయినా ట్రిపుల్ ని మాత్రం తలుచుకున్నారు. ఆస్కార్ వేదికపై స్టంట్స్ కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో వేయగా అందులో ఈ సినిమాలోని రెండు యాక్షన్ షాట్స్ ని చూపించారు. అలాగే చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన నాటు నాటు స్టెప్పు కూడా స్టేజ్ వెనక తెరపై చూపించారు.. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..